Tokyo Olympics 2020: ఒలింపిక్‌లో గుర్తుండిపోయే క్షణం.. గోల్డ్ మెడల్ పంచుకున్న ఇద్దరు స్నేహితులు

అంతర్జాతీయ స్థాయి క్రీడా టోర్నీలో స్వర్ణం గెలుచుకోవాలని ప్రతి క్రీడాకారుడి కల. ఏళ్ల తరబడి పరితపించి స్వర్ణం గెలిచిన సమయంలో తనతో పాటు అదే ఫీట్ సాధించిన వ్యక్తితో ఎలా పంచుకోవాలని సందిగ్ధపడుతుంటారు. కానీ, వారిద్దరూ చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకున్నారు.

Tokyo Olympics 2020: ఒలింపిక్‌లో గుర్తుండిపోయే క్షణం.. గోల్డ్ మెడల్ పంచుకున్న ఇద్దరు స్నేహితులు

Tokyo Olympics 2020

Tokyo Olympics 2020: అంతర్జాతీయ స్థాయి క్రీడా టోర్నీలో స్వర్ణం గెలుచుకోవాలని ప్రతి క్రీడాకారుడి కల. ఏళ్ల తరబడి పరితపించి స్వర్ణం గెలిచిన సమయంలో తనతో పాటు అదే ఫీట్ సాధించిన వ్యక్తితో ఎలా పంచుకోవాలని సందిగ్ధపడుతుంటారు. కానీ, వారిద్దరూ చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకున్నారు. స్వర్ణాన్ని పంచుకోవడం కుదురుతుందా అనడంతో అంతా షాక్ అయిపోయారు.

ఖతర్‌కు చెందిన ముతాజ్ బార్షిమ్ ప్రపంచ ఛాంపియన్ గా నిలవడమే కాక తనతో పాటు హై జంప్‌లో అదే ఫీట్ సాధించిన ఇటలీకి చెందిన గియాన్‌మార్కో టంబేరీతో పంచుకున్నారు. ఆదివారం జరిగిన ఈ అసాధారణ ఫీట్ కు యావత్ ప్రపంచం సంతోషంలో మునిగింది.

రికార్డు స్థాయిలో బర్షీమ్, తంబేరీ 2.37మీటర్ల హై జంప్ చేశారు. మక్సీమ్ నదేసెకౌ అనే వ్యక్తి కూడా అంతే ఎత్తు ఎగిరి నేషనల్ రికార్డ్ బ్రేక్ చేశాడు. కానీ అంతకంటే ముందు ఒక ఫెయిల్యూర్ ఉండటంతో గోల్డ్ షేర్ చేసుకునే అవకాశం కోల్పోయాడు.

30 ఏళ్ల బర్షీమ్ 2012లో కాంస్య పతకాన్ని, 2016 రియోఒలింపిక్స్ లో రజిత పతకాన్ని గెలిచాడు. తంబేరీ కూడా 2016లో గోల్డ్ గెలిచాడు. అయినప్పటికీ తన స్నేహితుడితో గోల్డ్ పంచుకుంటున్న ఆనందంలో గ్రౌండ్ మీద పడి దొర్లుకుంటూ.. నవ్వుతూ.. ఆనందభాష్పాలతో విజయాన్ని పంచుకున్నాడు.

2.37 మీటర్ల ఎత్తుకు హై జంప్ చేశారు ఈ ఇద్దరు క్రీడాకారులు. అలా హై జంప్ ఫైనల్ మ్యాచ్ కాస్త టై బ్రేకర్ గా ముగిసింది. ఈ మ్యాచ్ కి రిఫరీలు సైతం బంగారు పతకం ఎవరికివ్వాలి అనే దానిపై సందిగ్ధంలో పడిపోయారు. ఈ క్రమంలోనే ఖతార్ ఆటగాడు బర్సిమ్ ముందుకొచ్చి ఇద్దరికీ గోల్డ్ మెడల్ ఇవ్వాలి అని ప్రతిపాదించాడు. వాళ్లు కూడా ఓకే అనేయడంతో నిర్ణయం చరిత్రాత్మకం అయింది.