Ind vs Ban 3rd ODI: క‌్లీన్‌స్వీప్ గండం గట్టెక్కేనా? నేడు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మూడో వన్డే
మూడో వన్డేకు కెప్టెన్ రోహిత్‌శర్మతో సహా మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. రెండో వన్డేలో బొటనవేలికి గాయమైనప్పటికీ చివరిలో బ్యాటింగ్ కు వచ్చి వీరోచితంగా పోరాడిన కెప్టెన్ రోహిత్ శర్మ.. మూడో వన్డే నుంచి తప్పుకున్నాడు. ఈ మ్యాచ్‌తోపాటు టెస్టు సిరీస్ కు కూడా రోహిత్ అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువ. దీంతో కేఎల్ రాహుల్ సారథ్యంలో టీమిండియా మూడో వన్డేలో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.

Ind vs Ban 3rd ODI: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా పేలవ ప్రదర్శనతో వరుస ఓటములను చవిచూస్తోంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన టీమిండియా.. మూడో మ్యాచ్ నేడు ఆడనుంది. ఉదయం 11.30 గంటలకు ఛటోగ్రామ్ వేదికగా మ్యాచ్ జరుగుతుంది. రెండు వరుస విజయాలతో ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ జట్టు మూడో వన్డేలోనూ భారత్‌ను ఓడించి వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసేందుకు సిద్ధమైంది. మూడోవన్డేలో సత్తాచాటి క్లీన్‌స్వీప్ గండం నుంచి బయటపడేందుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.
మూడో వన్డేకు కెప్టెన్ రోహిత్‌శర్మతో సహా మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. రెండో వన్డేలో బొటనవేలికి గాయమైనప్పటికీ చివరిలో బ్యాటింగ్ కు వచ్చి వీరోచితంగా పోరాడిన కెప్టెన్ రోహిత్ శర్మ.. మూడో వన్డే నుంచి తప్పుకున్నాడు. ఈ మ్యాచ్‌తోపాటు టెస్టు సిరీస్ కు కూడా రోహిత్ అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువ. దీంతో కేఎల్ రాహుల్ సారథ్యంలో టీమిండియా మూడో వన్డేలో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్ ఇషాన్ కిషన్ తుది జట్టులోకి రానున్నాడు. రెండోవన్డేలో రోహిత్ గాయంకారణంగా ధావన్, కోహ్లీ ఓపెనర్లుగా వచ్చారు. అయితే, వీరు ఆరంభంలోనే పెవిలియన్ బాటపట్టారు. మూడో వన్డేలో ఓపెనర్లు రాణిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
Bangladesh vs India: రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి.. సిరీస్ కైవసం చేసుకున్న బంగ్లాదేశ్
రెండోవన్డే తరహాలో మూడోవన్డేలోనూ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్‌చేస్తే పెద్ద స్కోరు చేయాల్సిందే. లేకుంటే బంగ్లాచేతిలో మరోపరాభవం తప్పదు. మరోవైపు దీపక్ చౌహార్, కుల్‌దీప్ సేన్ కూడా గాయపడి చివరి వన్డేకు దూరమయ్యారు. వీరి స్థానంలో భారత్ ఒక స్పిన్నర్‌ను బరిలోకి దింపే అవకాశం ఉంది. షాబాజ్ లేదా కుల్‌దీప్ ఆ స్థానంలో ఆడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు టీమిండియా బౌలింగ్ కాస్త పర్వాలేదనిపిస్తున్నా.. మూడో వన్డేలో పూర్తిస్థాయి ప్రదర్శన చేయకుంటే బంగ్లాదేశ్‌లో ఘోరపరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. మహ్మద్ షమీ లేకపోవటం లోటే అయినప్పటికీ.. ఫేసర్లు సిరాజ్, శార్దూల్, ఉమ్రాన్, స్పిన్నర్ సుందర్, అక్షర్‌లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేస్తే బంగ్లా బ్యాటర్లను కట్టడిచేయడం తేలికైనపనే. అయితే, టీమిండియా ఆటగాళ్లు మూడోవన్డేలో ఎలాంటి ప్రతిభను కనబరుస్తారో వేచి చూడాల్సిందే. ఒకవేళ టీమిండియా మరోసారి ఓడిపోతే.. బంగ్లాదేశ్ జట్టు తొలిసారి భారత్ జట్టుపై వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసినట్లవుతుంది.