VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

టీమిండియాకు కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ఎంపికయ్యాడని బీసీసీఐ కన్ఫామ్ చేసింది. మే25న ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియాకు కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తారని వెల్లడించింది. ఈ పర్యటన జూన్ 26నుంచి మొదలుకానుంది.

VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

Vvs Laxman

Updated On : May 26, 2022 / 7:13 PM IST

 

 

VVS Laxman: టీమిండియాకు కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ఎంపికయ్యాడని బీసీసీఐ కన్ఫామ్ చేసింది. మే25న ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియాకు కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తారని వెల్లడించింది. ఈ పర్యటన జూన్ 26నుంచి మొదలుకానుంది.

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మేనేజింగ్ ఇంగ్లండ్‌లో రీషెడ్యూల్ చేసిన ఐదో టెస్ట్ వైట్-బాల్ సిరీస్ కోసం సీనియర్ సభ్యుల జట్టుకు బాధ్యత వహించనున్నారు.

జూన్ 19న బెంగళూరులో దక్షిణాఫ్రికాతో 5మ్యాచ్‌ల టీ20 సిరీస్ పూర్తయిన తర్వాత ద్రవిడ్ పర్యాటక జట్టులో చేరాలని భావిస్తున్నారు.

Read Also: టీమిండియా హెడ్ కోచ్‌ పదవి.. పాంటింగ్ నో చెప్పడంతోనే..

భారత జట్టు డబ్లిన్ పర్యటనకు వెళ్లడాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా బుధవారం ధ్రువీకరించారు. గతేడాది రవిశాస్త్రి టెస్టు జట్టుతో కలిసి ఇంగ్లండ్‌లో ఉన్నప్పుడు, అప్పటి నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ) హెడ్‌గా ఉన్న ద్రవిడ్ శ్రీలంకతో వైట్ బాల్ సిరీస్‌లో పాల్గొన్నప్పుడు కూడా ఇదే విధమైన ఏర్పాటు చేశారు.

భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో క్రికెట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కోచింగ్ విభాగంలో లక్ష్మణ్‌కు చాలా అనుభవం ఉంది.