ICC WTC, 2021-23: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో టాప్-5 బ్యాట్స్‌మెన్ వీరే.. ఐదుగురూ డబుల్ సెంచరీ..

ఈ టాప్-5 బ్యాటర్లు అందరూ డబుల్ సెంచరీలు బాదారు. జూన్ 7 నుంచి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. భారత్-ఆస్ట్రేలియా తలపడతాయి.

ICC WTC, 2021-23: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో టాప్-5 బ్యాట్స్‌మెన్ వీరే.. ఐదుగురూ డబుల్ సెంచరీ..

ICC WTC

ICC WTC, 2021-23: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (ICC World Test Championship)లో టీమిండియా(Team India)-ఆస్ట్రేలియా (Australia ) ఇప్పటికే ఫైనల్ కు చేరాయి. 2021-23 మధ్య జరిగిన టెస్టుల్లో జట్టుల ప్రదర్శన ఆధారంగా టాప్ లో ఉన్న టీమిండియా-ఆస్ట్రేలియా ఫైనల్ లో పోటీ పడనున్నాయి. జూన్ 7 నుంచి ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో ఇప్పటివరకు ఏ బ్యాటర్లు వ్యక్తిగతంగా ఏదైనా ఓ మ్యాచులో అత్యధిక స్కోరు చేశారో చూద్దాం…

టామ్ లాథమ్-252 పరుగులు: న్యూజిలాండ్ బ్యాటర్ టామ్ లాథమ్ 2022లో క్రైస్ట్‌చర్చ్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచులో 252 పరుగులు చేశాడు. అందులో 6 సిక్సులు, 34 ఫోర్లు ఉన్నాయి. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో అప్పట్లో న్యూజిలాండ్ స్కోరు 521గా నమోదైంది.

కేన్ విలియమ్సన్-215: న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఇటీవల వెల్లింగ్టన్ లో శ్రీలంకతో జరిగిన టెస్టులో 215 పరుగులు బాదాడు. దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 580/4గా నమోదైంది. చివరకు ఈ టెస్టు మ్యాచులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 58 పరుగులతో గెలుపొందింది.

దినేశ్ చండిమాల్-206: శ్రీలంక బ్యాటర్ దినేశ్ చండిమాల్ 2022లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచులో 206 పరుగులు బాదాడు. దీంతో శ్రీలంక ఇన్నింగ్స్ 39 పరుగులతో ఆ మ్యాచులో గెలుపొందింది. 326 బంతుల్లో దినేశ్ చండిమాల్ 5 సిక్సులు, 15 ఫోర్లు కొట్టాడు.

మార్నస్ లాబుస్చాగ్నె-204, స్టీవెన్ స్మిత్-200: ఆస్ట్రేలియా క్రికెటర్ మార్నస్ లాబుస్చాగ్నె 2022లో పెర్త్ లో వెస్టిండీస్ తో జరిగిన టెస్టులో 204 పరుగులు చేశాడు. ఇదే మ్యాచులో స్టీవెన్ స్మిత్ కూడా 200 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 598/4 స్కోరు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 182/2 కొట్టింది. 164 పరుగులతో గెలుపొందింది.

Dosa: మసాలా దోశ ఆర్డర్ చేస్తే.. దోశ, మసాలా వేర్వేరుగా వచ్చిన వైనం.. వాటిని కస్టమర్ ఏం చేశాడో తెలుసా?