WTC Final: నాలుగోరోజూ వర్షమే? ఫలితం తేలేనా?

భారీ అంచనాలు, ఆశల మధ్య క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేసిన వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌(WTC Final)కు ఆది నుంచి వరుణుడు అడ్డంకిగా మారాడు. ఎడతెరిపి లేకుండా వర్షం కురిపించి తొలిరోజు ఆటను ఊడ్చేసిన వరుణుడు.. నాలుగో రోజు ఆటకు కూడా ఆటంకం కలిగించేందుకు సిద్ధమయ్యాడు.

WTC Final: నాలుగోరోజూ వర్షమే? ఫలితం తేలేనా?

Wtc 21

WTC 2021 Final: భారీ అంచనాలు, ఆశల మధ్య క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేసిన వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌(WTC Final)కు ఆది నుంచి వరుణుడు అడ్డంకిగా మారాడు. ఎడతెరిపి లేకుండా వర్షం కురిపించి తొలిరోజు ఆటను ఊడ్చేసిన వరుణుడు.. నాలుగో రోజు ఆటకు కూడా ఆటంకం కలిగించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు నివేదికలు వస్తున్నాయి.

నాలుగోరోజైన సోమవారం కూడా సౌథాంప్టన్‌లో భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. ఈ రోజు పూర్తిగా ఆట కొనసాగే పరిస్థితి ఉండదని, 90 శాతానికి పైగా వర్షం కురుస్తోందని అంటున్నారు. అక్కడి వాతావరణశాఖ చెబుతోన్న వివరాల ప్రకారం.. మధ్యాహ్నం వరకు అతి భారీ, ఆ తర్వాత మోస్తరు జల్లులు కురుస్తాయని వెల్లడించారు. సాయంత్రానికి వర్షం కాస్త తగ్గుముఖం పట్టినా కూడా.. వెలుతురు ఉండదని అంటున్నారు.

ఇప్పటికే ఫస్ట్ రోజు మొత్తం వృథా అయింది. రెండో రోజు రెండు సెషన్లమేరకు ఆట జరిగింది. మూడోరోజు అరగంట ఆలస్యంగా ఆట మొదలైంది. బ్యాడ్ లైట్ కారణంగా ముందుగానే ముగిసింది. నాలుగో రోజు కూడా పూర్తిగా వర్షం పడి మ్యాచ్ జరగకపోతే మాత్రం.. ఫలితం వచ్చే అవకాశాలు తక్కువ అయిపోతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.