Raina on Virat Kohli: ఐపీఎల్ గెలవలేకపోయాడు.. మీరు ఐసీసీ ట్రోఫీ గురించి మాట్లాడుతున్నారా – కోహ్లీ గురించి రైనా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా ఓడిపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా భవిష్యత్ గురించి అంతా మాట్లాడేస్తున్నారు.

10TV Telugu News

Raina on Virat Kohli: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా ఓడిపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా భవిష్యత్ గురించి అంతా మాట్లాడేస్తున్నారు. టెస్టు కెప్టెన్ గా 33 విజయాలు సాధించిన ఇండియన్ కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలోనూ కొనసాగగలడా అనే సందేహాలు మొదలయ్యాయి.

దీనిపై టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా రెస్పాండ్ అయ్యారు. కోహ్లీ.. అతని కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. అతనికి ఇంకొంచెం సమయం కావాలి. ఐసీసీ ట్రోఫీ గెలిచేంత దగ్గరగా వచ్చిన ఇండియా.. ఫైనల్ లో బెడిసికొట్టింది. కాకపోతే ఫైనల్ అంటే కాస్త సమయం పడుతుందని .. కోహ్లీ చేతుల మీదుగా టీమిండియా ఒక్కసారైనా ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని కాంక్షిస్తున్నట్లు చెప్పాడు రైనా.

‘అతను నెం.1 కెప్టెన్ గా ఉండాలనుకుంటున్నా. అతని రికార్డులే చెబుతున్నాయి. అతను ఏం సాధించాడో. ప్రపంచంలోనే నెం.1 బ్యాట్స్ మెన్. మీరంతా ఐసీసీ ట్రోఫీ గురించి మాట్లాడుతున్నారు. కానీ, ఇంకా ఐపీఎల్ ట్రోఫీనే గెలుచుకోలేకపోయాడు. అతనికి ఇంకొంత సమయం కావాలనుకుంటున్నా. రెండు మూడు వరల్డ్ కప్ మ్యాచ్ లు ఒక దాని వెంట మరొకటి జరుగుతున్నాయి. రెండు టీ20 వరల్డ్ కప్ లు, 50ఓవర్ల్ వరల్డ్ కప్. ఫైనల్ చేరుకోవడం అంత సులువేం కాదు. కొన్ని సార్లు కొన్నింటిని కోల్పోవాల్సి వస్తుంది’ అని చెప్పారు రైనా.

అంతేకాకుండా ఇండియా WTC ఫైనల్ ఓడిపోయిందనే విషయాన్ని గుర్తు చేశాడు. పరిస్థితులను బట్టి కాదు బ్యాట్స్ మెన్ రాణించలేకనే అలా జరిగింది. రెండు రోజులు మొత్తం వర్షం కారణంగా రద్దు అయిపోయింది. నాలుగు సెషన్స్ లో బ్యాట్ చేయాల్సి ఉంది. కానీ, ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ 170పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ టార్గెట్ సాధించేసి ట్రోఫీని ముద్దాడింది. ఈ ప్రదర్శనలో సీనియర్ బ్యాట్స్ మెన్ మరికొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే బాగుండేదని రైనా అభిప్రాయపడ్డారు.

10TV Telugu News