Home » Ap Cabinet Meeting
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ సమయానికి సొంత ఇంటి స్థలం ఉండేలా నిర్ణయం తీసుకుంది.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశంలో ప్రవేశపెట్టున్నట్లు సమాచారం. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్స్ లకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను ప్రభుత్వం సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
AP Government : 26న సున్నా వడ్డీ కింద డ్వాక్రా మహిళలకు, విదేశీ విద్యాదీవెన కింద లబ్దిదారులకు ఈ నెల 28న డబ్బులు జమ.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు మరికొద్ది నెలల సమయం ఉంది. అయితే, సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారంసైతం జరుగుతుంది. ఈ క్రమంలో పలు వర్గాల ప్రజలపై కేబినెట్ భేటీలో వరాల జల్లు కురిపించేలా నిర్ణయాలు ఉండే అవకాశం లేకపోలేదు.
సీఎం జగన్ అధ్యక్షతన ఇవాల కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీ తర్వాత మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కీలక అంశాలపై వారితో చర్చించారు. అదే సమయంలో మంత్రులకు వార్నింగ్ కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్.
సీఎం జగన్ మంత్రులను మారుస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. మరోసారి మంత్రులను మారుస్తానని జగన్ అంటున్నారు. అన్నిసార్లు మంత్రులను మార్చటం ఎందుకు? జగన్నే మార్చేస్తే సరిపోతుందిగా అంటూ సెటైర్ వేశారు.
ఏపీ మంత్రివర్గ సమావేశం బుధవారం జరగనుంది. ఏపీలోని సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఉదయం పదకొండు గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. సీపీఎస్ రద్దు, మూడు రాజధానుల అంశంపై చర్చిస్తారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళ అయ్యింది. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి బుధవారం జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఇక దేవాదాయ శాఖ భూముల ఆక్రమణలకకు అడ్డుకట్ట వేసేలా చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలను ఆమోదించనుంది.ఉమ్మడి జిల్లాల జెడ్పి చైర్మన్ల పదవీకాలం పూర్తయ్యేవరకూ కొత్త జిల్లాలకు కొనసాగించే చట్ట సవరణకు ఆమోదించనుంది.
సీఎం జగన్ రేపటి (శుక్రవారం) ఢిల్లీ పర్యటన రద్దైంది. దీంతో శుక్రవారం జరగాల్సిన కేబినెట్ సమావేశం యధావిధిగా కొనసాగుతుందని సీఎంవో ప్రకటించింది. ఉదయం 11గంటలకు జరిగే మంత్రివర్గ సమావేశానికి మంత్రులంతా హాజరుకావాలని ఆదేశించింది.