AP Government : ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఆ రోజున ఖాతాల్లోకి డబ్బులు
AP Government : 26న సున్నా వడ్డీ కింద డ్వాక్రా మహిళలకు, విదేశీ విద్యాదీవెన కింద లబ్దిదారులకు ఈ నెల 28న డబ్బులు జమ.

AP Government (Photo : Google)
AP Government Funds : ఏపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని సామాజికవర్గాల వారికి న్యాయం జరిగేలా సీఎం జగన్ స్కీమ్స్ తీసుకొచ్చారు. అందులో భాగంగా లబ్దిదారులకు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయా స్కీమ్స్ కింద అర్హుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ చేశారు. త్వరలో మరికొన్ని పథకాల కింద లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు వేయనున్నారు. ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Also Read..Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం మౌనం.. వైసీపీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నా..
ఈ నెల 18న జగనన్న తోడు, 21న నేతన్న నేస్తం నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు కేబినెట్ నిర్ణయించిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఈ నెల 26న సున్నా వడ్డీ కింద డ్వాక్రా మహిళలకు, విదేశీ విద్యాదీవెన కింద లబ్దిదారులకు ఈ నెల 28న డబ్బులు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. అటు, 1966 రెవెన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు.
Also Read..Chandrababu: బీజేపీతో పొత్తు, వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అన్ని వర్గాల వారికి ప్రయోజనం చేకూర్చే విధంగా సీఎం జగన్ స్కీమ్స్ డిజైన్ చేశారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలు.. ఇలా అందరికీ ఆర్థిక సాయం అందిస్తున్నారు. జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న విద్యాదీవెన, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ లా నేస్తం, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ చేయూత.. ఇలా అనేక రకాల స్కీమ్స్ తీసుకొచ్చారు.