AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు, దసరా నుంచి విశాఖ కేంద్రంగా ప్రభుత్వ పాలన

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ సమయానికి సొంత ఇంటి స్థలం ఉండేలా నిర్ణయం తీసుకుంది.

AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు, దసరా నుంచి విశాఖ కేంద్రంగా ప్రభుత్వ పాలన

AP Cabinet Key Decisions

Updated On : September 20, 2023 / 2:58 PM IST

AP Cabinet Key Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. జగనన్న సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకం ప్రవేశపెట్టింది. దసరా నుంచి విశాఖ కేంద్రంగా ప్రభుత్వ పాలన సాగనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లులకు అమోదం లభించింది. ప్రైవేట్ యూనిర్సిటీల చట్టంలో సవరణ బిల్లు కేబినెట్ ఆమోదం పొందింది.

అసైన్డ్ భూములు క్రమబద్ధీకరణ, పీవోటీ చట్ట సవరణకు ఆమోదం లభించింది. దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.  జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ సమయానికి సొంత ఇంటి స్థలం ఉండేలా నిర్ణయం తీసుకుంది. బుధవారం వెలగపూడి సచివాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ కేబినెట్ హాల్ లో సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం జరిగింది.

TDLP : అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీఎల్పీ నిర్ణయం.. చంద్రబాబు అక్రమ అరెస్టు, ప్రజా సమస్యలపై గళమెత్తాలని లోకేష్ పిలుపు

కేబినెట్ భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దసరా నుంచి విశాఖ కేంద్రంగా ప్రభుత్వ పాలన సాగనున్నట్లు తెలిపారు. దసరా నాటికి విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించనున్నట్లు పేర్కొన్నారు. ముందుగా సీఎం క్యాంప్ ఆఫీస్, సీఎంవో సిబ్బంది తరలింపు ఉంటుంది. జమిలి ఎన్నికలపై కేంద్రం నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని సూచించారు.

జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహానికి ఆమోదం లభించింది. జగనన్న సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకం ప్రవేశపెట్టింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకవడివారికి వర్తింప చేయనున్నారు. ప్రిలిమినరీ, మెయిన్స్ లో ఉత్తీర్ణులైన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. ప్రిలిమినరీ క్వాలిఫై అయితే రూ.లక్ష ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు. మెయిన్ క్వాలిఫై అయితే రూ.1.5 లక్షల ప్రోత్సాహకం ఇవ్వనున్నారు.

Chandrababu Arrest : చంద్రబాబు పిటీషన్లపై పొన్నవోలు రాకుంటే నేను వాదిస్తా : సీఐడీ పీపీ వివేకానంద

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ సమయానికి సొంత ఇంటి స్థలం ఉండేలా నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రియింబర్స్ మెంట్, రిటైర్డ్ ఉద్యోగులు, వారి పిల్లలకు ఆరోగ్య శ్రీ సౌకర్యం కల్పనకు ఆమోదం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.