AP Cabinet : డిసెంబర్ 15న ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

ముందుగా డిసెంబర్ 14న క్యాబినెట్ భేటీ నిర్వహించాలనుకున్నప్పటికీ.. మరుసటి రోజుకు మార్చినట్లు సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.

AP Cabinet : డిసెంబర్ 15న ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

Updated On : December 12, 2023 / 6:35 PM IST

AP Cabinet Meeting : ఏపీ క్యాబినెట్ సమావేశం డిసెంబర్15న జరుగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ క్యాబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా డిసెంబర్ 14న క్యాబినెట్ భేటీ నిర్వహించాలనుకున్నప్పటికీ.. మరుసటి రోజుకు మార్చినట్లు సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు క్యాబినెట్ సమావేశంలో ఉంచే ప్రతిపాదనలను రేపు(బుధవారం) సాయంత్రం 4 గంటల్లోపు సమర్పించాలని ఆదేశించారు.

మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జీల మార్పుకు వైసీసీ సిద్ధమైంది. మొత్తం 62 చోట్ల ఇంచార్జీలను మార్చనున్నట్లు సమాచారం. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు 11 మంది కొత్త ఇంఛార్జీలను ప్రకటించింది. ఈ 11 నియోజకవర్గాల్లో మొత్తం నలుగురికి స్థానం చలనం కలిగించారు. మొత్తం ముగ్గురికి టికెల్ లేదని తేల్చి చెప్పారు.  మిగిలిన చోట్ల కొత్త ఇంచార్జీలను నియమించారు. తొలి విడతగా 11 మందిని మార్చగా రానున్న రోజుల్లో విడతల వారిగా మార్పులు చేయనున్నారు. మొత్తం 62 నియోజకవర్గాల్లో ఇంచార్జీల మార్పులు కచ్చితంగా ఉంటాయని కనిపిస్తోంది.

Telangana Bhavan : 2025 మార్చి నాటికి ఢిల్లీలో తెలంగాణ భవన్ !.. ఏర్పాటుపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం

ఇప్పటికే ఉమ్మడి ఒంగోలు, గుంటూరు జిల్లాల్లో మార్పులు చేశారు. డిసెంబర్ 12న మరో ఉమ్మడి జిల్లాలో మార్పులను వెల్లడించే అవకాశం ఉంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం, ఎన్నికల్లో పార్టీ శ్రేణులను విజయంతంగా నడిపించడం వంటి తదితర అంశాలను ప్రాతికపదికగా తీసుకుని, సామర్థ్యం కలిగిన వారిని ఇంచార్జీలుగా నియమించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకండా 30 మంది సిట్టింగ్ లకు వైసీపీ ఈసారి టికెట్లు నిరాకరించనున్నట్లు విశ్వసనీయం సమాచారం.

30 మందికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థాన చలనం ఉంటుదని సమాచారం. డిసెంబర్ 11న ప్రకటించిన 11 మంది లిస్టులో స్థానం చలనం కల్పించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలలో నలుగురికి వేర్వేరు స్థానాల్లో అవకాశం కల్పించారు. ఈ విధంగా 62 నియోజకవర్గాల్లో 30 మందికి పైగా స్థాన చలనం కలిగించే అవకాశం కనిపిస్తోంది. మరో 30 మందికి వరకు టికెట్ పూర్తిగా లేనట్లుగా నిర్ణయించినట్లుగా సమాచారం. కొంతమందిని పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.