Telangana Bhavan : 2025 మార్చి నాటికి ఢిల్లీలో తెలంగాణ భవన్ !.. ఏర్పాటుపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం

ఢిల్లీలోని అశోకా రోడ్డుతో పాటు శ్రీమంత్ మాధవరావు సింథియా మార్గ్ లో కలిపి రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా 19. 733 ఎకరాల భూమి ఉంది. అశోకా రోడ్డులోని 8. 726 ఎకరాల్లో ఏపీ-తెలంగాణ భవన్ ఉంది.

Telangana Bhavan : 2025 మార్చి నాటికి ఢిల్లీలో తెలంగాణ భవన్ !.. ఏర్పాటుపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం

Telangana Bhavan

Updated On : December 12, 2023 / 9:42 AM IST

Telangana Bhavan in Delhi : ఢిల్లీలో తెలంగాణ భవన్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ భవన్ ను పరిశీలిస్తున్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చించి సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇవ్వనున్నారు. 2025 మార్చి నాటికి ఢిల్లీలో తెలంగాణ భవన్ ఏర్పాటు కానుంది. రాష్ట్ర విభజన నాటి నుంచి భవన్ విభజన అంశం పెండింగ్ లో ఉంది. విభజన చట్టం ఆధారంగా 58:42 ప్రకారం రెండు రాష్ట్రాలు భవన్ ఆస్తులు పంచుకున్నాయి.

ఢిల్లీలోని అశోకా రోడ్డుతో పాటు శ్రీమంత్ మాధవరావు సింథియా మార్గ్ లో కలిపి రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా 19. 733 ఎకరాల భూమి ఉంది. అశోకా రోడ్డులోని 8. 726 ఎకరాల్లో ఏపీ-తెలంగాణ భవన్ ఉంది. ఉమ్మడి భవన్ లో ఏపీ వాటా 4.3885 ఎకరాలు (విలువ రూ.1,703.6 కోట్లు), తెలంగాణ వాటా 4.3375 ఎకరాలు (రూ.1,694.4 కోట్లు)గా ఉంది. 0.511 ఎకరాల రోడ్డులో రెండు రాష్ట్రాలకు చెరో 0.2555 ఎకరాలు (రూ.160 కోట్లు) ఉంది.

Anjani Kumar : మాజీ డీజీపీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేత

ప్రస్తుతం తెలంగాణ కింద ఉన్న గోదావరి బ్లాక్ 4.082 ఎకరాలు (రూ.1,614.40 కోట్లు), నర్సింగ్ హాస్టల్ 3. 367 ఎకరాలు (రూ.1,318 కోట్లు) ఉంది. ఏపీ కింద ఉన్న శబరి బ్లాక్ 4.133 ఎకరాలు (రూ.1,623.60 కోట్లు), పటౌడీ హౌస్ లోని 7.640 ఎకరాలు (రూ.2,394 కోట్లు) ఉంది. శ్రీమంత్ మాధవరావు సింథియా మార్గ్ లో 7.640 ఎకరాల విస్తీర్ణంలోని పటౌడీ హౌస్ వేరుగా ఉంది.

గతంలో ఢిల్లీలో అశోక రోడ్ లోని ఏపీ-తెలంగాణ భవన్ తమకే కావాలని గత తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ, ఏపీ అధికారుల ముందు తెలంగాణ అధికారులు ప్రతిపాదనలు ఉంచారు. హైదరాబాద్ హౌస్ కి అనుకొని ఉన్న స్థలంతో తెలంగాణ ప్రజలకు భావోద్వేగ సంబంధాలున్నాయని గతంలో హోంశాఖ, ఏపీ అధికారులకు తెలంగాణ అధికారులు తెలిపారు.

New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ సర్కార్ కసరత్తు…నేడు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్ష

ఉమ్మడి ఏపీ- తెలంగాణ భవన్, శబరి బ్లాక్, రోడ్డు, నర్సింగ్ హాస్టల్ సహా 12 ఎకరాల పైగా భూమి తమకు చెందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షగా హోంశాఖ, ఏపీ అధికారులకు తెలంగాణ అధికారులు తెలిపారు. 58:42 నిష్పత్తిలో ఏపీకి దక్కాల్సిన భూమికి మార్కెట్ ధర ప్రకారం ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీ అధికాలకు తెలంగాణ అధికారులు తెలిపారు.

కాగా, గతంలో ఏపీ భవన్ ఏపీకేనని, ఖాళీ స్థలాన్ని తెలంగాణ తీసుకోవాలని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కొత్త ప్రతిపాదన చేసింది. ఏప్రిల్ 26న కేంద్ర హోంశాఖ సమావేశం మినిట్స్ విడుదల చేసింది. పటోడి హౌస్ 7.64 ఎకరాల స్థలాన్ని తెలంగాణకు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ప్రతిపాదించింది. శబరి బ్లాకు, గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్ బ్లాక్ లను 12.09 ఎకరాలు ఏపీకి ఇవ్వాలని ప్రతిపాదించింది.

AP : మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీలో మరో 850 ఎంబీబీఎస్ సీట్లు

ఈ ప్రతిపాదనతో ఏపీ, తెలంగాణ జనాభా నిష్పత్తికి అనుగుణంగా రెండు రాష్ట్రాలకు వాటా దక్కుతుందని తెలిపింది. చాలా తక్కువ తేడా ఉంటుందని, అవసరమైతే ఏపీ ప్రభుత్వం కొంత రియంబర్స్ మెంట్ చేస్తుందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. కేంద్ర ప్రతిపాదన ఆచరణ యోగ్యంగా ఉందని ఏపీ ప్రభుత్వం తెలిపింది.