Home » died
మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. వైద్య పరీక్షలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలింత, వృద్ధుడు దుర్మరణం చెందారు. ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టింది.
చిత్తూరు జిల్లాలో విద్యుత్ షాక్ తో ఏనుగు మృతి చెందింది. జిల్లాలోని బంగారుపాళ్యంలో పొలంలో బోరు మీటర్ ను తొండంతో లాగడంతో విద్యుత్ షాక్ తగిలి ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది.
మేడ్చల్ జిల్లాలో విషాదం నెలకొంది. జవహర్ నగర్ లో అదృశ్యమైన బాలిక మృతి చెందారు. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో విషాదం నెలకొంది. అబార్షన్ ట్యాబ్లెట్ వేసుకున్న ఓ మహిళ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఫిఫా వరల్డ్ కప్ లో మరో విషాదం నెలకొంది. రెండు రోజుల క్రితం ఫుట్ బాల్ మ్యాచ్ లైవ్ ఇస్తూ అమెరికాకు చెందిన గ్రాంట్ వహ్ల్ అనే జర్నలిస్టు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అతని మరణ వార్త మరిచిపోకముందే మరో జర్నలిస్టు మృతి చెందారు.
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. రోడ్డు పక్కన బస్సు కోసం ఎదురుచూస్తున్న వారిపైకి ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు మృతి చెందారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రత్లాం జిల్లాలో చోట�
ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది. గురువింద గింజలు తిని బాలుడు మృతి చెందాడు. 24 గంటల్లోనే అతను మరణించాడు. అతడి ఏడేళ్ల సోదరుడిని గంగారం ఆస్పత్రి డాక్టర్లు వైద్యం చేసి రక్షించారు.
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో విషాదం నెలకొంది. బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు రావడంతో స్టీరింగ్‌పైనే తుదిశ్వాస విడిచారు. బస్సు అదుపు తప్పి వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఓ వృద్ధుడు మృతి చెందారు.
చత్తీస్ ఘడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. మాలగావ్ లో గని కూలి ఏడుగురు మృతి చెందారు. మరో 12 మందికి పైగా శిథిలాల్లో చిక్కుకున్నారు.
వరంగల్‌లో విషాదం నెలకొంది. చాక్లెట్ ఓ బాలుడి ప్రాణం తీసింది. గొంతులో చాక్లెట్ ఇరుక్కుని ఓ బాలుడు మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.