Abortion Tablet Woman Died : అబార్షన్ ట్యాబ్లెట్ వేసుకున్న మహిళ మృతి
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో విషాదం నెలకొంది. అబార్షన్ ట్యాబ్లెట్ వేసుకున్న ఓ మహిళ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

woman died
Abortion Tablet Woman Died : కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో విషాదం నెలకొంది. అబార్షన్ ట్యాబ్లెట్ వేసుకున్న ఓ మహిళ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రీతి కుష్వా(33) అనే మహిళ ఈ-కామర్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె భర్త మరో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే ప్రీతికి 11 నెలల బేబి ఉంది. మళ్లీ ఆమె ఇప్పుడు నెల తప్పింది. దీంతో డిసెంబర్ 10న మెడికల్ చెకప్ చేసుకోగా ప్రెగ్నెన్సీ పాటిజివ్ గా నిర్ధారణ అయింది.
అయితే తనకు ప్రస్తుతం 11 నెలల బేబీ ఉండటంతో ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్నారు. దీంతో అబార్షన్ ట్యాబ్లెట్ తీసుకురమ్మని భర్తకు చెప్పారు. కానీ అతను తిరస్కరించారు.భర్త ఇంట్లో లేని సమయంలో అబార్షన్ ట్యాబ్లెట్ ను తెప్పించుకుని వేసుకున్నారు. అనంతరం ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో ఆస్పత్రికి వెళ్దామని భార్యను భర్త అడిగారు. అందుకు ఆమె నిరాకరించారు.
కాసేపటికే ఆమె స్పృహ కోల్పోయారు. అప్రమత్తమైన భర్త భార్యను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అబార్షన్ పిల్ వేసుకోవడంతోనే తీవ్ర రక్తస్రావం జరిగి మరణించినట్లు ఆమె సోదరుడు పోలీసులకు చెప్పారు.