Road Accident Six Died : బస్సు కోసం ఎదురుచూస్తున్నవారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఆరుగురు మృతి, మరో 10 మందికి తీవ్ర గాయాలు

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. రోడ్డు పక్కన బస్సు కోసం ఎదురుచూస్తున్న వారిపైకి ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు మృతి చెందారు. మరో పది మందికి  తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రత్లాం జిల్లాలో చోటు చేసుకుంది.

Road Accident Six Died : బస్సు కోసం ఎదురుచూస్తున్నవారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఆరుగురు మృతి, మరో 10 మందికి తీవ్ర గాయాలు

road accident Six died

Updated On : December 5, 2022 / 7:54 AM IST

road accident Six died : మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. రోడ్డు పక్కన బస్సు కోసం ఎదురుచూస్తున్న వారిపైకి ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు మృతి చెందారు. మరో పది మందికి  తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రత్లాం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే..  రత్లాం జిల్లాలోని సత్రుండ సమీపంలోని రత్లాం-ఇండోర్ ఫోర్ లైన్ రోడ్డుపై కొంతమంది బస్సు కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదే సమయంలో అటుగా వస్తున్న వేగంగా వస్తున్న ట్రక్కు టైర్ పగిలిపోవడంతో అదుపు తప్పి వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.రక్తపు మరకలతో చెల్లాచెదరుగా పడిన ఉన్న మృతదేహాలతో ఘటనాస్థలం భీతావహంగా మారింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మరో నలుగురి పరిస్థితి విషమం..

సమాచారం తెలుసుకున్న కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం రత్లాం ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం అనంతరం ట్రక్కును వదిలిపెట్టి డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటనపై రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.