Smartphone: స్మార్ట్‌ఫోన్‭కు బాగా అడిక్ట్ అయ్యారా? అలవాటు తగ్గించుకోవడానికి ఇలా చేయండి

ఫోన్ వినియోగాన్ని నియంత్రించడానికి మీ స్క్రీన్‭ను ఎంత సమయం ఆన్ చేసి ఉంచారో గమనించడం ముఖ్యం. మామూలుగా స్క్రీన్‌పై ఎంత సమయం గడుపుతున్నారో ఏ ఏ యాప్‌లలో ఎక్కువ సమయం గడుపుతున్నారో చెక్ చేసుకోవడం మంచిది. ఈ యాప్‌లు ఫేస్‭బుక్, ఇన్‭గ్రామ్ వంటి సోషల్ నెట్‌వర్క్‌లైతే, ఆ యాప్‌లను తొలగించి, మొబైల్ ఉపయోగించడం మొదలు పెట్టండి.

Smartphone: స్మార్ట్‌ఫోన్‭కు బాగా అడిక్ట్ అయ్యారా? అలవాటు తగ్గించుకోవడానికి ఇలా చేయండి

Smartphone: ఈరోజుల్లో స్మార్ట్‭ఫోన్ అనేది శరీరంలో ఒక భాగమైపోయింది. ఏ పనిలో ఉన్నా, ఎక్కడికి వెళ్లినా, ఏం చేస్తున్నా.. చేతిలోనో, జేబులోనే ఫోన్ లేకుండా అయితే ఉండలేం. అయితే ఈ అతివాడకం అనేది చాలా దుష్పరిణామాలకు దారి తీస్తోంది. ఇది తెలిసి కూడా కొన్నిసార్లు స్మార్ట్‭ఫోన్‭కు దూరంగా ఉండలేకపోతున్నాం. కానీ, కొన్ని టిప్స్ పాటిస్తే అలా చేయొచ్చని అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం..

నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి
నోటిఫికేషన్లను ఆఫ్ చేయడం అనేది స్మార్ట్‭ఫోన్ వాడకాన్ని తగ్గించే అతి సులువైన ఉపాయాలలో ప్రధానమైంది. చాలా యాప్‌లు, సోషల్ మీడియాలు గతంలో చూసిన పోస్ట్‌లు, ప్రొడక్ట్‌లను పోలి ఉండే కొత్త కంటెంట్, ప్రోడక్ట్ ఆప్షన్‌లతో యాప్‌తో కనెక్ట్ చేయడానికి పుష్ నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. దీనికి మార్గం ఏమిటంటే, ఏదైనా యాప్ నుండి పుష్ నోటిఫికేషన్లను అంగీకరించకపోవడం మంచిది. ఇలా అయితే ఫోన్ మీద కొంచెం అటెన్షన్ తగ్గుతుంది.

China: చైనాలో పందుల కోసం ప్యాలెస్.. 26 అంతస్థులతో బిల్డింగ్ నిర్మాణం.. రోగాలు వ్యాపిస్తాయంటున్న నిపుణులు

గూగుల్ సర్చ్‭లో వేరే బ్రౌజర్‌ని ఉపయోగిస్తున్నారా?
సోషల్ మీడియా, సైబర్ సెక్యూరిటీ నిపుణులు గూగుల్‭కి మన ప్రతి విషయం మీద సమాచారం ఉంటుందని చెపుతారు. లొకేషన్, బ్యాంక్ బ్యాలెన్స్, ఖర్చు విధానాలు, బ్రౌజర్ బుక్‌మార్క్‌లు, యూట్యూబ్ హిస్టరీ, ఇలా అన్ని పరిచయాలు, అన్ని మీడియా ఫోటో, వీడియోలు మనం ఆలోచించగలిగే ప్రతిదాన్ని సమాచారాన్ని గూగుల్ తీసుకుంటుంది. అందుకే ఈ విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.

ఎక్కువ నంబర్లు ఉండే విధంగా ఫోన్ పాస్‌వర్డ్‌ మార్చండి
పెద్దవైన, కష్టమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోవడం వల్ల ప్రతి ఐదు నిమిషాలకు ఫోన్ వంక చూసుకోకుండా ఉంటాము. దీంతో ఏదైనా నోటిఫికేషన్, మెసేజ్ వచ్చినా మాటి మాటికీ చెక్ చేయడం అనేది తగ్గుతుంది. ప్యాటర్న్, పిన్, ఫేస్ అన్‌లాక్‌ని ఉపయోగించడం ఆపివేయండి, ఇది ఫోన్‌ను మళ్లీ మళ్లీ స్క్రోల్ చేయడానికి అన్‌లాక్ చేయకుండా చేస్తుంది.

Pavitra Lokesh: సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పవిత్ర లోకేశ్.. అసత్య ప్రచారం అంటూ వారిపై ఫిర్యాదు..

మీ స్క్రీన్ సమయాన్ని చెక్ చేసుకోండి
ఫోన్ వినియోగాన్ని నియంత్రించడానికి మీ స్క్రీన్‭ను ఎంత సమయం ఆన్ చేసి ఉంచారో గమనించడం ముఖ్యం. మామూలుగా స్క్రీన్‌పై ఎంత సమయం గడుపుతున్నారో ఏ ఏ యాప్‌లలో ఎక్కువ సమయం గడుపుతున్నారో చెక్ చేసుకోవడం మంచిది. ఈ యాప్‌లు ఫేస్‭బుక్, ఇన్‭గ్రామ్ వంటి సోషల్ నెట్‌వర్క్‌లైతే, ఆ యాప్‌లను తొలగించి, మొబైల్ ఉపయోగించడం మొదలు పెట్టండి.

అనవసరమనిపించే యాప్‌లను వెంటనే తొలగించండి
అనవసరమైన యాప్‌లను ఆ సమయానికి వాడటం పూర్తైన వెంటనే అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి. లేదంటే మొబైల్ నుంచి తీసేయడం మరీ ఉత్తమం. పిల్లలకు అందుబాటులో ఫోన్ ఉండకుండా చూడాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఫోన్ వాడకం దానంతట అదే తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా, ఫోన్‭కు కాస్త దూరంగా ఉంటే కొత్త ఆలోచనలు పుడతాయట.

Australia Woman Murder Case : బాబోయ్.. తనను చూసి కుక్క మొరిగిందని చంపేశాడు.. ఆస్ట్రేలియాలో యువతి హత్య వెనుక షాకింగ్ నిజం