Australia Woman Murder Case : బాబోయ్.. తనను చూసి కుక్క మొరిగిందని చంపేశాడు.. ఆస్ట్రేలియాలో యువతి హత్య వెనుక షాకింగ్ నిజం

ఆస్ట్రేలియా యువతిని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న కారణాలను నిందితుడు రాజ్ విందర్ సింగ్(38) పోలీసులకు తెలిపాడు. కుక్క మొరిగిందని దాని యజమానిని తాను హత్య చేసినట్లు రాజ్ విందర్ సింగ్ వెల్లడించాడు.

Australia Woman Murder Case : బాబోయ్.. తనను చూసి కుక్క మొరిగిందని చంపేశాడు.. ఆస్ట్రేలియాలో యువతి హత్య వెనుక షాకింగ్ నిజం

Updated On : November 26, 2022 / 8:23 PM IST

Australia Woman Murder Case : భారత్ కు చెందిన ఓ వ్యక్తి.. ఆస్ట్రేలియాలో యువతిని హత్య చేసి ఇండియాకు పారిపోయి వచ్చిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. కాగా, ఆస్ట్రేలియా యువతిని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న కారణాలను నిందితుడు రాజ్ విందర్ సింగ్(38) పోలీసులకు తెలిపాడు. కుక్క మొరిగిందని దాని యజమాని అయిన ఆస్ట్రేలియా యువతిని తాను హత్య చేసినట్లు రాజ్ విందర్ సింగ్ వెల్లడించాడు.

హత్యకు దారి తీసిన కారణాలను రాజ్ విందర్ సింగ్ పోలీసులకు తెలిపాడు. ఆ రోజు తన భార్యతో గొడవపడిన నిందితుడు రాజ్‌విందర్ సింగ్ రిలాక్స్ అయ్యేందుకు క్వీన్స్‌లాండ్‌లోని వాంగెట్టి బీచ్‌కు వెళ్లాడు. పండ్లు, కూరగాయల కత్తిని వెంట తీసుకెళ్లాడు. అదే సమయంలో మృతురాలు తొయా కార్డింగ్లే(24) తన పెంపుడు కుక్కతో ఆ బీచ్‌లో వాకింగ్‌ చేస్తోంది. అదే సమయంలో సింగ్‌ వైపు చూసిన కుక్క మొరిగింది.

Also Read : Tamil Nadu: పాముకు పూజలు చేస్తుండగా నాలుకపై కాటేసిన పాము.. భక్తుడి నాలుక కోసేసిన పూజారి

అప్పటికే చిరాకులో ఉన్న సింగ్ కు.. కుక్క తనను చూసి మొరగడం అస్సలు నచ్చలేదు. దీంతో అతడు కుక్క యజమానితో గొడవకు దిగాడు. మాట మాట పెరిగి ఘర్షణ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన సింగ్.. విచక్షణ కోల్పోయాడు. కత్తితో దాడి చేసి యువతిని చంపేశాడు. ఆ తర్వాత డెడ్ బాడీని బీచ్ లోనే పాతిపెట్టాడు. కుక్కను అక్కడి చెట్టుకు కట్టేసి పారిపోయాడని పోలీసుల విచారణలో తేలింది.

Also Read : Mexican Woman Killed : 5వేల కి.మీ ప్రయాణించి తన కోసం వచ్చిన ప్రియురాలిని హత్య చేసి అవయవాలు అమ్ముకున్నాడు

పంజాబ్‌కు చెందిన సింగ్.. నర్సింగ్‌ అసిస్టెంట్‌. కాగా, మృతురాలు కార్డింగ్లే ఫార్మసీ ఉద్యోగిని. 2018, అక్టోబర్ 21న కనిపించకుండా పోయింది. తర్వాత రోజు వాంగెట్టి బీచ్‌లో ఆమె మృతదేహం దొరికింది.

Australia Woman Murder Case

హత్య జరిగిన రెండు రోజుల తర్వాత సింగ్‌ తన ఉద్యోగాన్ని, భార్య, ముగ్గురు పిల్లలను వదిలేసి భారత్‌కు వచ్చేశాడు. అతడి ఆచూకీ కోసం ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. అతడి అప్పగింతకు భారత్‌ నుంచి ఆమోదం లభించడంతో పటియాలా కోర్టు నవంబర్ 21న నాన్‌బెయిల్‌ వారెంట్‌ను జారీ చేసింది. రాజ్‌విందర్‌ ఆచూకీ తెలిపిన వారికి రూ.8.17 కోట్లు బహుమతిగా ఇస్తామని క్వీన్స్ లాండ్ పోలీసులు ప్రకటన కూడా ఇచ్చారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో యువతిని హత్య చేసి భారత్‌లో దాక్కున్న నిందితుడు రాజ్‌విందర్‌ సింగ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఆ యువతిని హత్య చేయడానికి గల కారణాలను దర్యాప్తు బృందం వెల్లడించింది.