కండిషన్స్ అప్లై : ఎయిర్ టెల్ రూ. 76 రీఛార్జ్ ఆఫర్ !

ప్రముఖ దేశీయ మొబైల్ నెట్ వర్క్ దిగ్గజం ఎయిర్ టెల్ తమ వినియోగదారుల కోసం మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. ఎయిర్ టెల్ న్యూ కస్టమర్ల కోసం రూ.76 రీఛార్జ్ తో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది.

  • Published By: sreehari ,Published On : January 4, 2019 / 08:00 AM IST
కండిషన్స్ అప్లై : ఎయిర్ టెల్ రూ. 76 రీఛార్జ్ ఆఫర్ !

ప్రముఖ దేశీయ మొబైల్ నెట్ వర్క్ దిగ్గజం ఎయిర్ టెల్ తమ వినియోగదారుల కోసం మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. ఎయిర్ టెల్ న్యూ కస్టమర్ల కోసం రూ.76 రీఛార్జ్ తో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది.

ప్రముఖ దేశీయ మొబైల్ నెట్ వర్క్ దిగ్గజం ఎయిర్ టెల్ తమ వినియోగదారుల కోసం మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. టెలికాం రంగంలో జియో రాకతో నెలకొన్న పోటీకి ధీటుగా ఎయిర్ టెల్ సహా పలు టెలికాం ఆపరేటర్లు ఆఫర్లు మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం ఎయిర్ టెల్ న్యూ కస్టమర్ల కోసం రూ.76 రీఛార్జ్ తో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తీసుకున్న కొత్త కస్టమర్లు రూ.26 టాక్ టైమ్ కూడా పొందవచ్చు. అంతేకాదు.. 28 రోజుల కాలపరిమితితో 100 ఎంబీల డేటాను కూడా ఉచితంగా పొందవచ్చు.

కొత్త కస్టమర్లకు మాత్రమే..
ముఖ్య గమనిక. ఈ ఆఫర్ కేవలం కొత్త ఎయిర్ టెల్ కస్టమర్లకు మాత్రమేనట.ఎయిర్ టెల్ కొత్త కస్టమర్లు ముందుగా రూ. 76 ఫస్ట్ టైం రీఛార్జ్ (ఎఫ్ఆర్సీ) చేయించుకోవాల్సి ఉంటుంది. గత ఏడాదిలో ఎఫ్ఆర్సీ రీఛార్స్ లపై వరుసగా రూ.178, రూ. 229, రూ. 344, రూ. 495, రూ. 599 ప్యాకులను అందిస్తోన్న ఎయిర్ టెల్ జాబితాలో రూ. 76 రీఛార్జ్ వచ్చి చేరింది. ఈ ఎఫ్ఆర్సీ పోర్ట్ పోలియో నుంచి కొత్త కస్టమర్లు 126 జీబీ డేటా బెనిఫెట్స్ పొందవచ్చు. వాయిస్ కాల్స్ ప్రతి నిమిషానికి 60 పైసలు చొప్పున ఛార్జ్ అవుతుంది. కొత్త సిమ్ కార్డు పొందిన కస్టమర్లు మై ఎయిర్ టెల్ యాప్, అధికారిక ఎయిర్ టెల్ వెబ్ సైట్ మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.