Anand Mahindra : అగ్నిప్రమాదాల నుంచి ప్రాణాలను రక్షించే ఇటువంటి వినూత్నమైనవి చాలా అవసమంటున్న ఆనంద్ మహీంద్రా

అగ్నిప్రమాదాల నుంచి ప్రాణాలను రక్షించే ఇటువంటి వినూత్నమైనవి చాలా అవసరం అంటూ ఓ యానిమేటెడ్ వీడియోను ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేశారు.

Anand Mahindra : అగ్నిప్రమాదాల నుంచి ప్రాణాలను రక్షించే ఇటువంటి వినూత్నమైనవి చాలా అవసమంటున్న ఆనంద్ మహీంద్రా

Anand Mahindra inflatable safety device buildings on fire accident

Anand Mahindra : పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పెద్ద పెద్ద అపార్ట్ మెంట్లలో అగ్ని ప్రమాదం జరిగితే ఎలా బయటపడాలో అనే యానిమేటడ్ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఓ యానిమేటెడ్ వీడియో పోస్ట్ చేస్తూ..ఈ ఇన్ ఫ్లేటబుల్ సేఫ్టీ బెలూన్ చాలా అవసరం అంటూ చెప్పుకొచ్చారు ఆనంద్ మహీంద్రా. ఈ వీడియోలో ఇన్ ఫ్లేటబుల్ సేఫ్టీ బెలూన్ కనిపిస్తుంది.

బ్యాక్ ప్యాక్(షోల్డర్ బ్యాగ్)లా ఉండే దీన్ని భుజానికి తగిలించుకుని గ్రిల్స్ లేని విండో లేదా మేడపైకి వెళ్లి పిట్ట గోడ మీద నుంచి అయినా దూకే విధంగా ఈ షోల్డర్ బ్యాగ్ ఉంది. విండో లేదా భవనం పైన పిట్టగోడమీద మీద కూర్చుని బ్యాక్ ప్యాక్ నుంచి బెలూన్ పెద్దదయ్యేలా స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఓ పెద్ద బెలూన్ పువ్వు ఆకారంలో తెరుచుకుంటుంది. ఆ తరువాత వెంటనే కిందకు దూకేస్తే క్షేమంగా నేలపై ల్యాండ్ అయిపోవచ్చు. అగ్నికీలకల నుంచి సురక్షితంగా డిజైన్ చేసిన ఈ బ్యాక్ ప్యాక్ చాలా అవసరం అంటూ చెప్పుకొచ్చారు ఆనంద్ మహీంద్రా.

ఈ బ్యాక్ ప్యాక్ అనేది నిజమేనని నేను ఆశిస్తున్నాను. ఏదో ఒక కంపెనీ దీన్ని తయారు చేస్తూ ఉంటుంది. ఒకవేళ నేను ఎత్తయిన భవన సముదాయంలో (అపార్ట్ మెంట్) నివసించినట్లైతే దీన్ని కొనటం అవసరం అని భావిస్తున్నాను. ఇది ఎంతో ఇన్నోవేటివ్ గా ఉంది’’ అని తెలిపారు. ఇటువంటి వినూత్న విషయాలను ఆనంద్ మహీంద్రా తరచూ కోట్లాది మందితో ట్విట్టర్ వేదికగా పంచుకుంటుంటారు. ఎక్కడ టాలెంట్ ఉన్నా దాన్ని గుర్తించటం..తాను గుర్తించినదాన్ని ఇతరులకు తెలియజేస్తుంటారు ట్విట్టర్ ద్వారా. టాలెంట్ ను ప్రోత్సహిస్తుంటారు. 40 సెకన్ల ఈ యానిమేటెడ్ క్లిప్ పై యూజర్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు.