Text-to-Speech Engine: ఆండ్రాయిడ్ ఫోన్లపై వినిపించనున్న కొత్త గొంతు.. టెక్స్ట్ టు స్పీచ్‌‌లో సరికొత్త గొంతులు

ఆండ్రాయిడ్ ఫోన్లలో త్వరలో మరో కొత్త అప్‌డేట్ రానుంది. ‘టెక్స్ట్ టు స్పీచ్’ ఫీచర్‌లో మరిన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కొత్త గొంతులు వినిపించబోతున్నాయి. మొత్తం 67 భాషల్లో 421 రకాల కొత్త గొంతులు వినిపిస్తాయి.

Text-to-Speech Engine: ఆండ్రాయిడ్ ఫోన్లపై వినిపించనున్న కొత్త గొంతు.. టెక్స్ట్ టు స్పీచ్‌‌లో సరికొత్త గొంతులు

Text-to-Speech Engine: ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘టెక్స్ట్ టు స్పీచ్’ ఫీచర్ గురించి తెలిసిందే. ఆండ్రాయిడ్ యాప్స్‌కు సంబంధించి గూగుల్ అందిస్తున్న స్పీచ్ సర్వీస్ ఇది. ఈ ఫీచర్‌కు సంబంధించి త్వరలో కొత్త అప్‌డేట్ రానుంది.

Kanpur Hostel: అమ్మాయిల అసభ్య వీడియోలు చిత్రీకరించిన హాస్టల్ స్వీపర్.. ఫిర్యాదు చేసిన యువతులు

త్వరలో కొత్త వాయిస్‌లు వినిపించనున్నాయి. మొత్తం 67 భాషల్లో 421 రకాల కొత్త గొంతులు వినిపించబోతున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ వాయిస్‌లు మరింత స్పష్టంగా, సహజ సిద్ధంగా ఉంటాయి. ఫోన్‌లోని వివిధ రకాల టెక్స్ట్‌ను స్పీచ్‌గా చదివి వినిపించే ఫీచర్ ఇది. ఇప్పటికే లక్షలాది మంది యూజర్లు ఈ ఫీచర్ వాడుకుంటున్నారు. అయితే, కొత్త అప్‌డేట్ ద్వారా ఈ ఫీచర్ మరింత స్పష్టంగా పనిచేస్తుంది. కొత్త గొంతులతో, స్పష్టమైన పదాలు, నాణ్యతతో ఇది త్వరలోనే అందుబాటులోకి రానుందని గూగుల్ తెలిపింది.

Delhi Shocker: స్కూల్లో గొడవ.. పదో తరగతి విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన క్లాస్‌మేట్స్

ప్రస్తుతం ఉన్న ఫీచర్ ద్వారా కొన్ని పదాల విషయంలో స్పష్టత ఉండదు. వేర్వేరు పదాలు, వ్యాక్యాల మధ్య పెద్ద తేడా ఉండటం లేదు. అయితే, ఇకపై ప్రతి పదం స్పష్టంగా వినిపించేలా దీన్ని రూపొందించారు. 64-బిట్ ఆండ్రాయిడ్ డివైజెస్ అన్నింటిపై మరికొద్ది వారాల్లోనే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.