మన బడ్జెట్ లో : రూ.10వేల లోపు.. టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే.. 

మొబైల్ మార్కెట్లలో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అవుతోంది. అయితే ఏ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు బాగున్నాయి. డిజైన్ ఎలా ఉంది అనేదానిపై స్మార్ట్ ఫోన్ లవర్స్ లో ఆసక్తి నెలకొంది. 

  • Published By: sreehari ,Published On : March 15, 2019 / 09:42 AM IST
మన బడ్జెట్ లో : రూ.10వేల లోపు.. టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే.. 

మొబైల్ మార్కెట్లలో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అవుతోంది. అయితే ఏ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు బాగున్నాయి. డిజైన్ ఎలా ఉంది అనేదానిపై స్మార్ట్ ఫోన్ లవర్స్ లో ఆసక్తి నెలకొంది. 

స్మార్ట్ ఫోన్ల సేల్స్ సందడి మొదలైంది. సమ్మర్ స్పెషల్ ఆఫర్లతో మొబైల్ కంపెనీలు తమ కొత్త స్మార్ట్ పోన్లను భారత మార్కెట్లలోకి  విడుదల చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆకట్టుకునేందుకు పోటీపడి సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. అదిరిపోయే ఫీచర్లతో వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందులోనూ సమ్మర్ సీజన్ కావడంతో మొబైల్ మార్కెట్ కిటకిటలాడుతోంది. మరోవైపు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్ సైట్లలో మొబైల్ సేల్స్ హంగామా నడుస్తోంది. మొబైల్ మార్కెట్లలో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అవుతోంది. అయితే ఏ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు బాగున్నాయి. డిజైన్ ఎలా ఉంది అనేదానిపై స్మార్ట్ ఫోన్ లవర్స్ లో ఆసక్తి నెలకొంది. 
Read Also: PubG ఫ్యాన్స్ రిలాక్స్: గేమ్ బ్యాన్ చేయడం అంత ఈజీ కాదు!

ఏ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు బాగున్నాయి. ఏ మోడల్ ధర తక్కువగా ఉంది.. చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా.. అసలు ఏ స్మార్ట్ ఫోన్ కొనాలో తెలియక తికమక పడుతుంటారు. ఇప్పటివరకూ ఇండియాలో రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్లు ఎలాంటి ఫీచర్లు అందిస్తున్నాయి.. భారత మొబైల్ మార్కెట్లో ధర రూ.10వేల లోపు స్మార్ట్ ఫోన్లు ఎన్ని బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.. పదివేల ధరకే స్మార్ట్ ఫోన్లు సొంతం చేసుకోవాలనుకునే యూజర్ల కోసం.. ఇండియాలో చీప్ అండ్ బెస్ట్ 5 స్మార్ట్ ఫోన్ల వివరాలు అందిస్తున్నాం. మీకు నచ్చిన ఫీచర్లు.. డిజైన్.. ఎంచుకుని చక్కగా కొనేయండి.. ఓసారి లుక్కేయండి..  

1. రెడ్ మి నోట్ 7 : రూ. 9వేల 999 మాత్రమే
జియోమీ కంపెనీ అందిస్తోన్న రెడ్ మి సిరీస్ లలో రెడ్ మి నోట్ 7 మోడల్ స్మార్ట్ ఫోన్ ఒకటి. ఈ ఫోన్ ధర భారత మార్కెట్లలో రూ.9,999 మాత్రమే. ఒక రూపాయి తక్కువ రూ.10వేలకు స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 9వేల 999 నుంచి అందుబాటులో ఉంది. ఈ మోడల్ పై 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజీ యూజర్లను ఆకట్టుకునేలా ఉంది. అంతేకాదు.. చూడటానికి సరికొత్త డిజైన్ తో 6.3 అంగుళాల FHD+ డిసిప్లే, క్వాలికామన్ స్నాప్ డ్రాగన్ 660 ఎస్ఓసీ, 4000 ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. ఈ మోడల్ ఫోన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ ఫీచర్లు.. 12ఎంపీ, 2ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు. ఇక సెల్ఫీల కోసం 13 మెగా ఫిక్సల్ కెమెరా అందిస్తొంది. ఫోన్ చార్జింగ్ కోసం USB టైప్-సి పోర్ట్ కూడా ఉంది. 

2. రియల్ మి 3 : రూ. 8వేల 999 మాత్రమే
చైనా స్మార్ట్ ఫోన్ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో సబ్ బ్రాండ్ సంస్థ రియల్ మి.. కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లలోకి విడుదల చేసింది. అదే.. రియల్ మి 3. ఈ ఫోన్ ధర ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో రియల్ మి3 ఫోన్ ప్రారంభ ధర రూ.8వేల 999 మాత్రమే. రెడ్ మి నోట్ 7 తరువాత చీప్ అండ్ బెస్ట్ ఫోన్. రియల్ మి3 కొత్త స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. హెలియో పీ70 చిప్ సెట్, 4GB ర్యామ్, 64GB ఇంటర్నెల్ స్టోరేజీ అందిస్తోంది. ఈ ఫోన్.. యూజర్లను ఎట్రాక్ట్ చేసేది డిసిప్లే మోడ్.. హెచ్ డీ ప్లస్ డిసిప్లే ప్రధాన ఆకర్షణ. 4,230 ఎంఎహెచ్ బ్యాటరీ మంచి బ్యాక్ అప్ ఉంటుంది. ఇందులో మరో ఆసక్తికరమైన ఫీచర్.. స్పోర్ట్స్ 13మెగా ఫిక్సల్ కెమెరా, 2మెగా ఫిక్సల్ రియర్ కెమెరా, 13 మెగా ఫిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. 
Read Also: సెర్చ్ ఇమేజ్ ఫీచర్: మీ వాట్సాప్‌లో ఫొటోలు రియలో ఫేకో చెప్పేస్తుంది

3. శాంసంగ్ గెలాక్సీ M10 : రూ.8,990 మాత్రమే
ప్రముఖ మొబైల్ మేకర్ శాంసంగ్ సంస్థ భారత మార్కెట్లలో సరికొత్త స్మార్ట్ ఫోన్ M సిరీస్ లను రిలీజ్ చేసింది. అందులో ఒకటి.. గెలాక్సీ M10 మోడల్. ఈ ఫోన్ ప్రారం భ ధర రూ.8,990కే లభిస్తోంది. శాంసంగ్ అందించే ఎమ్ సిరీస్ లలో శాంసంగ్ గెలాక్సీ ఎ10 సిరీస్ కంటే దాదాపు రూ.500 మాత్రమే ఎక్కువ ఉంది. శాంసంగ్ న్యూ బడ్జెట్ సిరీస్ లో శాంసంగ్ గెలాక్సీ ఎమ్10 సిరీస్ చీపెస్ట్ ఫోన్. గెలాక్సీ M10 స్పోర్ట్స్ 6.2 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిసిప్లే, న్యూ ఇన్ఫినిటీ-వి కట్ ఔట్ తో అందిస్తోంది. ఎక్సోనస్7870 ప్రాసిసెర్ ఇన్ బుల్ట్, 8 కార్టెక్స్-ఏ53 కోర్స్ 1.6GHz. ఇక మెమెరీ, స్టోరేజీ విషయానికి వస్తే.. గెలాక్సీ ఎమ్10లో 3GB ర్యామ్, 32GB ఇంటర్నెల్ స్టోరేజీ ఆఫర్ చేస్తోంది. 13 మెగా ఫిక్సల్ ప్లస్, 5 మెగా ఫిక్సల్ రియర్ కెమెరాలు ఉండగా, సెల్ఫీ కోసం ప్రత్యేకించి.. 5 మెగా ఫిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉంది. గెలాక్సీ ఎమ్10 సిరీస్ లో 3,400ఎమ్ఎహెచ్ బ్యాటరీ అందిస్తోంది. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్.. ఫేస్ అన్ లాక్ ఫీచర్ ఉంది.. అయితే.. బయోమెట్రిక్ ఆప్షన్ మాత్రమే ఈ మోడల్ పై అందుబాటులో ఉంది. 

4. శాంసంగ్ గెలాక్సీ A10: రూ. 8వేల 490 మాత్రమే
శాంసంగ్ అందించే మరో సరికొత్త మోడల్.. గెలాక్సీ ఎ10 సిరీస్. శాంసంగ్ అందించే న్యూ బడ్జెట్ ఫోన్ల జాబితాలో ఈ ఫోన్ రెండో స్థానంలో ఉంది. గెలాక్సీ A సిరీస్ ను అప్ గ్రేడ్ చేసి గెలాక్సీ ఎ10 మోడల్ తీసుకొచ్చింది. గెలాక్సీ ఎ10 సిరీస్ మోడల్ ఫోన్ లో డిజైన్, అప్ గ్రేడెడ్ స్పెషిఫికేషన్లను అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ అందించే మరో మోడల్ గెలాక్సీ M10 సిరీస్ ను పోలి ఉంటుంది. ఇందులో 6.2 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిసిప్లే, ఇన్ఫినిటీ-వి కటౌట్, వి ఆకారంలో నాచ్ డిసిప్లేతో 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.  బ్యాక్ సైడ్ లో సింగిల్ 13 మెగా ఫిక్సల్ రియర్ కెమెరా ఉంది. గెలాక్సీ ఎ10 సిరీస్ ఎక్సోనస్ 7884 ప్రాసిసెర్ పై రన్ అవుతుంది. ఇక స్టోరేజీ, మెమెరీ విషయానికి వస్తే.. 2GB ర్యామ్, 32GB ఇన్ బుల్ట్ స్టోరేజీ ఉంది. 3,400 ఎంఎహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతుంది.  

5. Asus జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రొ M1 : రూ.8,499 మాత్రమే
జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 సిరీస్.. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ అసూస్ నుంచి రిలీజ్ అయింది. ఈ ఫోన్ భారత మార్కెట్లలోకి వచ్చి దాదాపు ఏడాది కావొస్తోంది. అయినప్పటికీ ఈ ఫోన్ క్రేజ్ మార్కెట్లో ఎంతమాత్రం తగ్గలేదు. బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఈ ఫోన్ ఈజ్ ద బెస్ట్ గా చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ డిజైన్ నాచ్ లెవల్ డిజైన్ తో 6 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిసిప్లే, బ్లాక్ 32జీబీ, 3 జీబీ ర్యామ్ స్నాప్ డ్రాగన్ 636 క్రయో ఒక్టో కోర్ ప్రాసిసెర్, బ్యాక్ సైడ్ డ్యుయల్ కెమెరా మాడ్యూల్ తో 13మెగా ఫిక్సల్, 5 ఎంపీ సెన్సార్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ నాచ్ ప్యాక్స్ 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే.. 5000ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. 10వాట్స్ ఫాస్ట్ చార్జర్, రెండు రోజుల వరకు బ్యాకప్ సామర్థ్యం ఉంది. డ్యుయల్ 4జీ సిమ్ కార్డులు, ట్రిపుల్ స్లాట్స్ స్పెషల్ ఎట్రాక్షన్.  
Read Also: రెడీ ఫర్ షో టైం : మార్చి 25న Apple 2019 ఫస్ట్ స్పెషల్ ఈవెంట్