Google Warn Employees : టార్గెట్ పూర్తి చేయండి.. కష్టపడి పనిచేయకపోతే కోత తప్పదు.. ఉద్యోగులకు గూగుల్ గట్టి వార్నింగ్!

Google Warn Employees : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఉద్యోగుల పనితీరుపై తీవ్రంగా మండిపడుతోంది. కంపెనీలో చేయాల్సిన పనికంటే ఉద్యోగులే ఎక్కువ మంది ఉన్నారని గూగుల్ భావిస్తోంది. కొద్ది రోజుల క్రితమే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) కూడా ఉద్యోగులను ఇదే విషయంలో హెచ్చరించారు.

Google Warn Employees : టార్గెట్ పూర్తి చేయండి.. కష్టపడి పనిచేయకపోతే కోత తప్పదు.. ఉద్యోగులకు గూగుల్ గట్టి వార్నింగ్!

Google warns employees of layoffs if they do not work hard or achieve target

Google Warn Employees : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఉద్యోగుల పనితీరుపై తీవ్రంగా మండిపడుతోంది. కంపెనీలో చేయాల్సిన పనికంటే ఉద్యోగులే ఎక్కువ మంది ఉన్నారని గూగుల్ భావిస్తోంది. కొద్ది రోజుల క్రితమే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) కూడా ఉద్యోగులను ఇదే విషయంలో హెచ్చరించారు. గూగుల్‌లో చాలా మంది ఉద్యోగులు ఉన్నారని, అయితే చాలా తక్కువ మంది పని చేస్తున్నారని అన్నారు. ఉద్యోగులు సమర్ధవంతంగా పని చేయాలని, వారి ఉత్పత్తులను మెరుగుపరచడం, వినియోగదారులకు ఎలా సహాయపడాలనే దానిపై మరింత దృష్టి పెట్టాలని ఆయన హెచ్చరించారు. ఓ కొత్త నివేదిక ప్రకారం.. ఉద్యోగుల తొలగింపుల విషయంలో గూగుల్ గట్టిగానే హెచ్చరించింది.

వచ్చే త్రైమాసిక ఆదాయాలపైనే ఉద్యోగుల కోత :

నివేదిక ప్రకారం పరిశీలిస్తే.. కొంతమంది టాప్ గూగుల్ ఎగ్జిక్యూటివ్‌లు తమ ఉద్యోగుల పనితీరును చూపించాలని కోరుతున్నారు. లేదంటే ఇంటికి వెళ్లేందుకు రెడీగా ఉండాలని హెచ్చరించారు. ఉద్యోగులు తమ పనితీరును పెంచుకోకపోతే.. తొలగింపులకు సిద్ధంగా ఉండాలని గూగుల్ బాస్ ప్రాథమికంగా సూచించారు. ఇంతకీ గూగుల్ కంపెనీలో ఉద్యోగుల తొలగింపులు జరుగుతాయా లేదా అనేది తదుపరి త్రైమాసిక ఆదాయాలపై ఆధారపడి ఉంటుందని గూగుల్ ఉన్నత అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. గూగుల్ క్లౌడ్ సేల్స్ (Google Colud Sales Management) విభాగంలో పనిచేస్తున్న Google ఉద్యోగులను సాధారణంగా విక్రయాల ఉత్పాదకతను పెంచేలా కష్టపడి పనిచేయాలని సూచించింది. వచ్చే త్రైమాసిక ఫలితాల్లోగా ఉద్యోగుల పనితీరు బాగా లేకుంటే విధుల్లో నుంచి తొలగింపులు తప్పవని నివేదించింది.

Google warns employees of layoffs if they do not work hard or achieve target

Google warns employees of layoffs if they do not work hard or achieve target

మైక్రోసాఫ్ట్ (Microsoft) , నెట్ ఫ్లిక్స్ బాటలోనే గూగుల్ :

గత కొంతకాలంగా Googleలో పనిపరమైన విషయాలు సరిగ్గా జరగడం లేదని భావిస్తోంది. ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని పరిగణనలోకి తీసుకుని టెక్ దిగ్గజం ఒక నెల క్రితమే ఉద్యోగ నియామకాలపై ఫ్రీజింగ్ ప్రకటించింది. తొలగింపుల గురించి గూగుల్ అధికారికంగా మాట్లాడనప్పటికీ, అందులో పనిచేసే ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఇతర టెక్ కంపెనీలైన నెట్‌ఫ్లిక్స్(Netflix Employees) , మైక్రోసాఫ్ట్ (Microsoft Employees) వంటి అనేక ఇతర పెద్ద టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగుల్లో కోతలను విధించాయి. మైక్రోసాఫ్ట్ ఇటీవల దాదాపు 2000 మంది ఉద్యోగులను తొలగించింది.

కంపెనీలో ఉద్యోగుల వేతనాలతో ఖర్చు భారాన్ని తగ్గించుకునేందుకు వేలాది మందిని ఇంటికి పంపేసింది. గత నెలలో Google CEO ఉత్పాదకతను మెరుగుపరుచుకోవాలని ఉద్యోగులకు గట్టిగా సూచనలు చేశారు. మెరుగైన ఫలితాలను వేగంగా ఎలా పొందాలనే దానిపై ఆలోచించాలని అన్నారు. Google ఉద్యోగుల సంఖ్యను సమీక్షించడానికి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి రెండు వారాల పాటు నియామకాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత, కంపెనీ హైరింగ్ ఫ్రీజ్ టైమ్‌లైన్‌ని పొడిగించింది.

Read Also : Sundar Pichai : కంపెనీలో చేసే పని కన్నా ఉద్యోగులే ఎక్కువ.. కోత తప్పదంటున్న గూగుల్ బాస్..!