Apply Passport Online : విదేశాలకు వెళ్లేందుకు మీకు పాస్‌పోర్టు లేదా? ఇలా సింపుల్‌గా అప్లయ్ చేసుకోవచ్చు!

Apply Passport Online : విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు పాస్‌పోర్టు ఉందా? విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా పాస్‌పోర్టు ఉండాల్సిందే.

Apply Passport Online : విదేశాలకు వెళ్లేందుకు మీకు పాస్‌పోర్టు లేదా? ఇలా సింపుల్‌గా అప్లయ్ చేసుకోవచ్చు!

How to apply for passport online on Passport Seva portal

Apply Passport Online : విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు పాస్‌పోర్టు ఉందా? విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా పాస్‌పోర్టు ఉండాల్సిందే. విద్య, తీర్థయాత్ర, పర్యాటకం, వ్యాపార ప్రయోజనం, వైద్యం కోసం లేదా ఫ్యామిలీ ఫంక్షన్ల కోసం విదేశాలకు వెళ్తున్నారా? భారత ప్రభుత్వం జారీ చేసిన అధికారిక అంతర్జాతీయ ప్రయాణ పత్రాన్ని (పాస్‌పోర్టు) కలిగి ఉండాలి.

గత కొన్ని ఏళ్లుగా భారత్ నుంచి విదేశీ ప్రయాణాలు భారీగా పెరిగాయి. తద్వారా పాస్‌పోర్ట్-సంబంధిత సేవలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) మే 2010లో పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్ట్ (PSP)ని ప్రారంభించింది.

పాస్‌పోర్ట్ సేవ పాస్‌పోర్ట్‌లు, సంబంధిత సేవల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పాస్ పోర్టు దరఖాస్తు చేసుకోవడం సులభతరం చేసింది. ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసే ప్రక్రియలో డాక్యుమెంట్లను తమ వివరాలతో నింపాల్సి ఉంటుంది. అంతేకాదు.. పాస్‌పోర్టు కోసం రాష్ట్ర పోలీసులచే వెరిఫికేషన్ కూడా ఉంటుంది.

How to apply for passport online on Passport Seva portal

How to apply for passport online on Passport Seva portal

పాస్ పోర్టు దరఖాస్తుదారు తమ అధికారిక అడ్రస్‌లో ఉండాల్సి ఉంటుంది. మీరు కూడా విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే.. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకు మీరు పాస్‌పోర్ట్ సేవా వెబ్ పోర్టల్‌ని విజిట్ చేయవచ్చు. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

పాస్‌పోర్ట్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలంటే? :
* పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్ passportindia.gov.inని విజిట్ చేయండి.
* హోమ్ స్క్రీన్‌పై “Register Now” లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా పోర్టల్‌కు నమోదు చేసుకోండి.
* రిజిస్ట్రేషన్ తర్వాత, రిజిస్టర్డ్ లాగిన్ IDతో పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్‌కి లాగిన్ చేయండి.
* ఇప్పుడు లేటెస్ట్ పాస్‌పోర్ట్/పాస్‌పోర్ట్‌ను మళ్లీ జారీ చేసేందుకు దరఖాస్తు చేసేందుకు ‘Apply‘ బటన్‌పై క్లిక్ చేయండి.
* ఫారమ్‌లో అవసరమైన అన్ని వివరాలను పూర్తి చేసి Submit చేయండి.
* మీరు View Saved/Submitted అప్లికేషన్‌ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి.
* సర్వీసు కోసం కనీస ఛార్జీలను చెల్లించడానికి ఇప్పుడు ‘Pay and Schedule Appointment‘ లింక్‌పై క్లిక్ చేయండి.

Note : అన్ని PSK/POPSK/PO వద్ద అపాయింట్‌మెంట్‌లను బుక్ చేసేందుకు ఆన్‌లైన్ పేమెంట్ తప్పనిసరి చేసింది. సాధారణ దరఖాస్తు రుసుము రూ. 1,500గా ఉంది. తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు రుసుము రూ. 2,000గా ఉంటుంది.

* నెట్ బ్యాంకింగ్ లేదా అందుబాటులో ఉన్న మరొక ఆప్షన్ ద్వారా రుసుమును చెల్లించాలి. మీ లావాదేవీ రసీదును ప్రింట్ తీసుకునేందుకు ‘Print Application Receipt‘ లింక్‌పై క్లిక్ చేయండి.
* మీరు మీ దరఖాస్తును దాఖలు చేసిన తర్వాత అపాయింట్‌మెంట్ వివరాలతో SMS కూడా అందుకుంటారు. పాస్‌పోర్ట్ ఆఫీసులో రుజువుగా చూపడానికి ఈ మెసేజ్ అవసరమని చెప్పవచ్చు.
* మీరు దరఖాస్తు సమయంలో సమర్పించిన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్‌లతో అపాయింట్‌మెంట్ తేదీలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (PSK)/ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీస్ (RPO)కు వెళ్లాల్సి ఉంటుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : E-passports : ఈ-పాస్‌పోర్టులు వస్తున్నాయి.. ఇక మీ డేటా సేఫ్.. ఎలా పనిచేస్తాయంటే?