Instagram Policy Update : ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త పాలసీలు: ఇకపై పెద్దోళ్లు.. మైనర్లకు డైరెక్టుగా మెసేజ్ చేయలేరు!

ముఖ ఫేస్ బుక్ సొంత ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ కొత్త పాలసీలు తీసుకొచ్చింది. ప్రత్యేకించి మైనర్ల సేఫ్టీ కోసం ఈ కొత్త పాలసీలను ప్రవేశపెట్టింది. మైనర్ యూజర్లు, పెద్దవాళ్లకు మధ్య మెసేజ్ కాన్వరేజేషన్ పరిమితి తగ్గించింది.

Instagram Policy Update : ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త పాలసీలు: ఇకపై పెద్దోళ్లు.. మైనర్లకు డైరెక్టుగా మెసేజ్ చేయలేరు!

Instagram Allow Adults To Message Minors

Instagram Not Allow Adults to Message Minors: ప్రముఖ ఫేస్ బుక్ సొంత ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ కొత్త పాలసీలు తీసుకొచ్చింది. ప్రత్యేకించి మైనర్ల సేఫ్టీ కోసం ఈ కొత్త పాలసీలను ప్రవేశపెట్టింది. మైనర్ యూజర్లు, పెద్దవాళ్లకు మధ్య మెసేజ్ కాన్వరేజేషన్ అనుమతిపై పరిమితి తగ్గించింది.

ఒకవేళ ఎవరైనా మైనర్ తమను ఫాలోకాని పక్షంలో వారికి పెద్దోళ్లు ఎవరూ ఇన్స్టా నుంచి డైరెక్ట్ మెసేజ్ పంపలేరని ఇన్‌స్టా తమ వెబ్‌సైటులో ఈ విషయాన్ని ప్రకటించింది. మైనర్లతో ఇంటరాక్ట్ అయ్యే సమయంలో పెద్దవాళ్లు ఎవరైనా 18ఏళ్ల లోపు చిన్నారులకు పెద్ద మొత్తంలో ఫ్రెండ్ రిక్వెస్ట్ లేదా మెసేజ్ రిక్వెస్టులు పంపుతూ తప్పుగా ప్రవర్తిస్తే ఇన్స్టా నుంచి మైనర్లకు కూడా నోటీసులు వస్తాయి.

అయితే ఈ అప్‌డేట్ నెలాఖరులో కేవలం కొన్ని దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. అతి త్వరలో అందరి ఇన్స్టా యూజర్లకు అందుబాటులోకి రానుంది. మైనర్లపై చేసే పబ్లిక్ పోస్టులపై కామెంట్లను కూడా హైడ్ చేయనుంది.

Insta

Insta