Moto G72 Launch in India : 108MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త మోటో G72 వచ్చేస్తోంది.. అక్టోబర్ 3నే లాంచ్.. కీలక ఫీచర్లు ఇవేనట!

Moto G72 Launch in India : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) G సిరీస్‌ లైనప్‌లో భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. అదే.. సరికొత్త Moto G72 స్మార్ట్‌ఫోన్. వచ్చే అక్టోబర్ 3న భారత మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది.

Moto G72 Launch in India : 108MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త మోటో G72 వచ్చేస్తోంది.. అక్టోబర్ 3నే లాంచ్.. కీలక ఫీచర్లు ఇవేనట!

Moto G72 is launching on October 3, some key specs and Flipkart availability confirmed

Moto G72 Launch in India : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) G సిరీస్‌ లైనప్‌లో భారత మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. అదే.. సరికొత్త Moto G72 స్మార్ట్‌ఫోన్. వచ్చే అక్టోబర్ 3న భారత మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. రాబోయే నెలలో స్మార్ట్‌ఫోన్ తయారీదారులు అనేక కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనున్నారు. అందులో ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ 7 సిరీస్‌ (Google Pixel 7 Series)ను భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్టు గూగుల్ ప్రకటించింది. ఇప్పుడు, Moto G72 లాంచ్‌కు ముందే.. కంపెనీ కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను రివీల్ చేసింది.

Moto G72 is launching on October 3, some key specs and Flipkart availability confirmed

Moto G72 is launching on October 3, some key specs and Flipkart availability confirmed

రాబోయే స్మార్ట్‌ఫోన్ ఇతర మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart Big Billion Days Sale)లో అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. మరికొంత కాలం వేచి ఉండాల్సిందే. Moto G72 రెండు కలర్ ఆప్షన్లలో మెటోరైట్ గ్రే, పోలార్ బ్లూలో వస్తోంది. Motorola రాబోయే Moto G72 కొన్ని కీలక వివరాలను ఇప్పటికే వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో సెంటర్-అలైన్డ్ పంచ్-హోల్ పోలెడ్ డిస్‌ప్లేతో రానుంది. ఈ ఫోన్ 1,300 నిట్స్ బ్రైట్‌నెస్, 10-బిట్ కలర్, DCI-P3 కలర్ గామట్, HDR10 సపోర్ట్‌తో వచ్చింది.

Moto G72 is launching on October 3, some key specs and Flipkart availability confirmed

Moto G72 is launching on October 3, some key specs and Flipkart availability confirmed

ఈ ఫోన్‌లో ఇన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉందట.. IP52-రేటెడ్ వాటర్ రిపెల్లెంట్‌కు సపోర్ట్‌తో వస్తుందని కంపెనీ ధృవీకరించింది. కెమెరా విషయానికొస్తే.. Moto G72 108-MP ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌తో రానుంది. ఇది డెప్త్ సెన్సార్‌గా అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. ఇందులో ప్రత్యేక మాక్రో కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్‌లో డాల్బీ అట్మోస్ (Dolby Atmos) ట్యూన్ చేసిన డ్యూయల్ స్పీకర్‌లు ఉంటాయని కంపెనీ తెలిపింది.

రాబోయే మోటరోలా స్మార్ట్‌ఫోన్ 6GB LPDDR4X RAM,128GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. MediaTek Helio G99 SoC ప్రాసెసర్ అందించనుంది. సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే.. ఈ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ 12 OS అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. ఫోన్ బాక్స్‌లో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో వస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Flipkart Big Billion Days sale : ఒప్పో రెనో 7, రెనో 8 సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..!