Nothing Phone (1) : జూలై 12న నథింగ్ ఫోన్ (1) వస్తోంది.. తమిళనాడులోనే తయారీ..!

Nothing Phone (1) : కార్ల్ పీ నేతృత్వంలోని నథింగ్ కంపెనీ భారత్ మార్కెట్లో నథింగ్ ఫోన్ (1)ని లాంచ్ చేయనుంది. జూలై 12న దేశంలో Nothing Phone (1) రిలీజ్ కానుంది.

Nothing Phone (1) : జూలై 12న నథింగ్ ఫోన్ (1) వస్తోంది.. తమిళనాడులోనే తయారీ..!

Nothing Phone (1) To Be Manufactured In Tamil Nadu, Company Confirms

Nothing Phone (1) : కార్ల్ పీ నేతృత్వంలోని నథింగ్ కంపెనీ భారత్ మార్కెట్లో నథింగ్ ఫోన్ (1)ని లాంచ్ చేయనుంది. జూలై 12న దేశంలో Nothing Phone (1) రిలీజ్ కానుంది. నివేదికల ప్రకారం.. నథింగ్ ఫోన్ (1) స్థానికంగా తయారు చేయనున్నట్టు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మను శర్మ వెల్లడించారు. అద్భుతమైన డిజైన్‌తో ఇయర్ వన్‌గా TWS ఇయర్‌బడ్‌లతో వస్తోంది. ఇదే డిజైన్‌తో ఈ ఫోన్‌ను కంపెనీ రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నథింగ్ జనరల్ మేనేజర్ మను శర్మ మాట్లాడుతూ.. భారత్‌లో విక్రయించే ప్రతి నథింగ్ ఫోన్ (1) స్థానికంగా తయారు చేయనున్నట్టు తెలిపారు.

అంతేకాదు.. తమిళనాడు ప్లాంటులోనే ఈ నథింగ్ ఫోన్ (1) తయారు చేయనున్నట్టు వెల్లడించారు. నథింగ్ ఫోన్ (1) జూలై 12న భారత్ సహా పలు మొబైల్ మార్కెట్‌లలో అందుబాటులోకి రానుంది. యూజర్లు రూ. 2000 చెల్లించి జూలై 12 నుంచి ఈ డివైజ్ ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ నథింగ్ ఫోన్ (1) ప్రీ-ఆర్డర్ ఫొటోను షేర్ చేశారు. రూ. 2000 వద్ద బుకింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫోన్ (1) ప్రీ-బుకింగ్ వివరాలు ఏమీ లేవు. స్మార్ట్ ఫోన్ యూజర్లు రూ.2వేలు చెల్లించి డివైజ్ కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు.

Nothing Phone (1) To Be Manufactured In Tamil Nadu, Company Confirms (1)

Nothing Phone (1) To Be Manufactured In Tamil Nadu

స్పెసిఫికేషన్‌లివే :
లీక్‌ల ప్రకారం.. నథింగ్ ఫోన్ (1) 6.55-అంగుళాల Full-HD+ OLED ప్యానెల్‌తో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 2400×1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుందని భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 7 Gen 1 చిప్‌సెట్‌తో పాటు గరిష్టంగా 8GB RAMతో రన్ అవుతుంది. ఈ ఫోన్ Android 12పై రన్ అవుతుంది. కెమెరాలను పరిశీలిస్తే.. నథింగ్ ఫోన్ (1) 50-MP ప్రైమరీ కెమెరాతో పాటు మరో రెండు సెన్సార్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫ్రంట్ సైడ్ 32MP ఒకటి ఉంది. డిజైన్ విషయానికి వస్తే.. నథింగ్ ఫోన్ (1) దాదాపు ఏ ఆండ్రాయిడ్ ఫోన్‌లో చూసినా దాదాపు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. డిజైన్ హెడ్ టామ్ హోవార్డ్ వాల్‌పేపర్‌ ఉంటుందని నివేదిక తెలిపింది.

Read Also : Nothing Phone: ‘నథింగ్ ఫోన్’ వచ్చేస్తోంది: డేట్, రేట్ ఇతర వివరాలు