Nothing Phone: ‘నథింగ్ ఫోన్’ వచ్చేస్తోంది: డేట్, రేట్ ఇతర వివరాలు

మిగతా స్మార్ట్‌ఫోన్స్‌తో పోల్చుకుంటే నథింగ్ ఫోన్‌లో ఎన్నో ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ట్రాన్స్పరెంట్ బ్యాక్ ప్యానెల్ గురించి చెప్పుకోవాలి.

Nothing Phone: ‘నథింగ్ ఫోన్’ వచ్చేస్తోంది: డేట్, రేట్ ఇతర వివరాలు

Nothing

Nothing Phone: స్మార్ట్‌ఫోన్ లేకుండా భవిష్యత్తులో మన ప్రపంచాన్ని ఊహించుకోలేము. బ్యాంకు పని, బిల్లు చెల్లింపులు ఇతర వ్యక్తిగతమైన ఏ పని చేయాలన్న స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే. అంతలా మన జీవితంలో భాగమైంది ఫోన్. రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వస్తుండగా..దాదాపు అన్ని ఫోన్స్ ఒకేలా ఉంటున్నాయి. దీంతో కొత్తదనం కోరుకునే వినియోగదారులకు ప్రస్తుతం ఉన్న ఫోన్స్ బోర్ కొట్టేస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకోవాలంటే సరికొత్తగా ఏదైనా చేస్తే తప్ప..ఫోన్ సంస్థలు అమ్మకాల్లో వృద్ధి సాధించలేవు. ఈ నేపథ్యంలోనే వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌తో వస్తుంది నథింగ్(Nothing) అనే టెక్ సంస్థ. యూకేకు చెందిన నథింగ్ సంస్థ మొట్టమొదటిసారిగా స్మార్ట్‌ఫోన్ విడుదల చేస్తుంది. ఇప్పటికే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌తో మార్కెట్లోకి ప్రవేశించిన..నథింగ్..మరికొన్ని రోజుల్లో స్మార్ట్‌ఫోన్ విడుదల చేయనుంది. మిగతా స్మార్ట్‌ఫోన్స్‌తో పోల్చుకుంటే నథింగ్ ఫోన్‌లో ఎన్నో ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ట్రాన్స్పరెంట్ బ్యాక్ ప్యానెల్ గురించి చెప్పుకోవాలి. ఈ నథింగ్ స్మార్ట్‌ఫోన్..పారదర్శకమైన ప్యానల్ కలిగి ఉంటుంది. అంటే..ఫోన్‌లోపల ఉండే హార్డ్ వేర్ భాగాలను మనం నేరుగా చూడొచ్చన్నమాట.

నాణ్యమైన గ్లాస్ మెటీరియల్‌తో తయారు చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ 1..వినియోగదారులకు మంచి అనుభూతి ఇస్తుందని సంస్థ పేర్కొంది. ఇప్పటికే నథింగ్ సంస్థ నుంచి వచ్చిన ట్రాన్స్పరెంట్ ఇయర్‌ఫోన్స్ భారత మార్కెట్లో సక్సెస్ అయ్యాయి. nothing ear 1 పేరుతో ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తున్న ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ విలువ రూ.6,999గా ఉంది. ఇక ప్రస్తుతం ఉత్పత్తి దశలో ఉన్న ఈ నథింగ్ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది జులై రెండో వారానికి ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లో అందుబాటులోకి రానున్నట్లు టెక్ వెబ్ సైట్స్ పేర్కొన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం ఉంది. అంటే ఫోన్‌ను ఛార్జింగ్ పాడ్ పై ఉంచినప్పుడు అదే ఛార్జ్ అయ్యే విధానాన్ని మనం నేరుగా కళ్ళతో చూడొచ్చు. దీంతో పాటుగా ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో ‘యూఐ’ కూడా వినియోగదారులకు ఓ సరికొత్త అనుభూతినిస్తుందని సంస్థ తెలిపింది. జులై లేదా ఆగష్టులో భారత మార్కెట్లోకి రానున్న ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ ధర రూ.41 వేలు ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

other stories: V-Strom SXను విడుదల చేసిన సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా