Ola S1 Air: ఓలా నుంచి ఎస్1 ఎయిర్ పేరుతో మరో ఎలక్ట్రిక్ స్కూటర్… ధర రూ.79,999.. వచ్చే ఏడాదే మార్కెట్లోకి

ఓలా సంస్థ త్వరలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఎస్ 1 ఎయిర్ పేరుతో కొత్త వాహనాన్ని వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకొస్తుంది. తాజాగా ఈ వాహనాన్ని కంపెనీ లాంఛ్ చేసింది. అయితే, డెలివరీ మాత్రం వచ్చే ఏప్రిల్‌లోనే.

Ola S1 Air: ఓలా నుంచి ఎస్1 ఎయిర్ పేరుతో మరో ఎలక్ట్రిక్ స్కూటర్… ధర రూ.79,999.. వచ్చే ఏడాదే మార్కెట్లోకి

Ola S1 Air: ఓలా సంస్థ తమ కంపెనీ నుంచి మూడో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి లాంఛ్ చేసింది. ఓలా ఎస్1 ఎయిర్ పేరుతో కొత్త స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.79,999 (ఎక్స్ షో రూమ్) మాత్రమే. ఇంతకుముందు విడుదలైన ఎస్1, ఎస్1 ప్రొ తో పోలిస్తే తాజాగా విడుదలైన స్కూటర్ ధర చాలా తక్కువ.

India: తగ్గుతున్న విదేశీ మారక నిల్వలు.. రెండేళ్ల కనిష్టానికి పడిపోయిన భారత విదేశీ నిల్వలు

ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.99,999 (ఎక్స్ షో రూమ్) కాగా, ఎస్1 ప్రొ ధర రూ.1,39,999 (ఎక్స్ షో రూమ్)గా ఉంది. ఈ రెండింటికన్నా తక్కువ ధరలోనే స్కూటర్ తేవాలన్న ఉద్దేశంతో ఓలా తాజా మోడల్‌ను మార్కెట్లోకి తేనుంది. ప్రస్తుత ధర లాంఛింగ్ ఆఫర్ మాత్రమే. త్వరలో ధర పెరిగే అవకాశం ఉంది. రూ.999 చెల్లించి ఈ నెల 24 లోపు స్కూటర్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. ఈ వాహనాన్ని కూడా సంస్థ ఎస్1 ప్లాట్‌ఫామ్‌పైనే తయారు చేసింది. ఇది ముందుగా విడుదలైన వాహనాల్లాగే ఉన్నప్పటికీ, బ్యాటరీని కొత్తగా రూపొందించింది.

Jharkhand: స్కూటీపై వెళ్తున్న యువతి కిడ్నాప్… అత్యాచారానికి పాల్పడ్డ పది మంది

ఇది 2.5 కిలో వాట్స్ పర్ అవర్ కెపాసిటీతో, 4.5కిలో వాట్స్ హబ్‌ మోటార్ కలిగి ఉంది. ఎకో స్పీడ్‌లో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ స్కూటర్ బరువు 99 కిలోలు. గరిష్ట వేగం 85 కిలోమీటర్లు. 4.3 సెకండ్లలోనే 40 కిలోమీటర్ల స్పీడ్ అందుకోగలదు. డ్యుయల్ టోన్ కలర్ స్కీమ్‌తో తయారైంది. కోరల్ గ్లామ్, నియో మింట్, ప్రొక్లియాన్ వైట్, జెట్ బ్లాక్, లిక్విడ్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. ఈ స్కూటర్ కొనుగోళ్లు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభం అవుతాయి. డెలివరీ ఏప్రిల్ నుంచి ఉంటుంది.