OnePlus Nord Watch : అదిరే ఫీచర్లతో సరసమైన ధరకే వన్‌ప్లస్ నార్డ్ వాచ్.. నీళ్లలో పడినా చెక్కుచెదరదు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 10 రోజులు వస్తుంది..!

OnePlus Nord Watch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్ వచ్చేసింది. భారత మార్కెట్లో అదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్ నార్డ్ వాచ్ (OnePlus Nord Watch) పేరుతో లాంచ్ అయింది. వన్‌ప్లస్ నుంచి రిలీజ్ అయిన వేరబుల్ బ్రాండ్‌లో ఇది రెండోది.

OnePlus Nord Watch : అదిరే ఫీచర్లతో సరసమైన ధరకే వన్‌ప్లస్ నార్డ్ వాచ్.. నీళ్లలో పడినా చెక్కుచెదరదు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 10 రోజులు వస్తుంది..!

OnePlus Nord Watch launched in India with water resistant rating, up to 10 days battery life

OnePlus Nord Watch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్ వచ్చేసింది. భారత మార్కెట్లో అదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్ నార్డ్ వాచ్ (OnePlus Nord Watch) పేరుతో లాంచ్ అయింది. వన్‌ప్లస్ నుంచి రిలీజ్ అయిన వేరబుల్ బ్రాండ్‌లో ఇది రెండోది. వన్‌ప్లస్ సరసమైన ధరకే అనేక హెల్త్ ఫీచర్లతో స్మార్ట్‌వాచ్‌ను అందిస్తోంది.

దీని ధర భారత మార్కెట్లో రూ. 5వేలు లోపు ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ మీ హార్ట్ రేట్, నిద్ర విధానాలు, ఇతర కార్యకలాపాలను ఈజీగా ట్రాక్ చేయగలదు. అంతేకాదు.. OnePlus Nord వాచ్‌తో యూజర్లు 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ పొందుతారని OnePlus పేర్కొంది. భారత మార్కెట్లో OnePlus Nord వాచ్ ధర రూ. 4,999గా ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ ఇప్పటికే సేల్‌కు సిద్ధంగా ఉంది. ఈ స్మార్ట్ వాచ్ OnePlus.in, OnePlus స్టోర్ యాప్ ద్వారా అందుబాటులో ఉంది.

OnePlus Nord Watch launched in India with water resistant rating, up to 10 days battery life

OnePlus Nord Watch launched in India with water resistant rating, up to 10 days battery life

OnePlus ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లను ఎంచుకోండి. అక్టోబర్ 4 నుంచి అమెజాన్ ద్వారా సేల్ అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లతో మరింత తక్కువ ధరకు స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ. 500 స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది. దీని ధర రూ. 4,499కి అందుబాటులో ఉంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేస్తే.. అదే డిస్కౌంట్ ఆఫర్‌ను పొందాలంటే ICICI బ్యాంక్ కార్డ్‌లను పొందవచ్చు.

OnePlus Nord వాచ్ 60Hz రిఫ్రెష్ రేట్, HD రిజల్యూషన్‌తో స్క్రీన్ 500నిట్స్, 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్మార్ట్ వాచ్‌లో రెక్టాంగ్యులర్ డయల్, సిలికాన్ బెల్టులు ఉన్నాయి. నావిగేషన్ కుడి వైపున ఒకే బటన్ ఉంది. ఈ ఫోన్ నోటిఫికేషన్‌లను నార్డ్ వాచ్‌లో చెక్ చేసుకోవచ్చు. మ్యూజిక్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మీ హెల్త్ స్టేటస్ ట్రాక్ చేసేందుకు రోజువారీ కార్యకలాపాలను మానిటరింగ్ చేయవచ్చు.

కంపెనీ అందించే N హెల్త్ యాప్ ద్వారా స్మార్ట్‌వాచ్‌ని కంట్రోల్ చేయవచ్చు. యాప్‌లో దాదాపు 100 వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. నార్డ్ వాచ్‌లో 105 ఫిట్‌నెస్ మోడ్‌లు ఉన్నాయి. మీరు రన్నింగ్ లేదా వాకింగ్ వెళ్ళినప్పుడు ఈ స్మార్ట్ వాచ్ ధరిస్తే మీ హెల్త్ స్టేటస్‌ను ఆటోమాటిక్‌గా రిజిస్టర్ చేస్తుంది. కొత్త OnePlus Nord వాచ్ రెండు నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలో హెల్త్ రిపోర్టును అందించగలదు.

OnePlus Nord Watch launched in India with water resistant rating, up to 10 days battery life

OnePlus Nord Watch launched in India with water resistant rating, up to 10 days battery life

మీ హార్ట్ రేటు, ఒత్తిడి స్థాయిలు, ఆక్సిజన్ సంతృప్తతను (SpO2) అందించగలదని కంపెనీ పేర్కొంది. వాచ్ ఇంటర్నల్ అల్గారిథమ్‌తో మహిళల నెలవారీ పీరియడ్స్ కూడా అంచనా వేయగలదు. OnePlus Nord వాచ్ IP68 రేట్ చేశారు. అంటే నీటి నిరోధకత కలిగి ఉంటుంది. కానీ, స్కూబా డైవింగ్ కోసం ఈ స్మార్ట్ వాచ్ వినియోగించరాదు. OnePlus Nord Watch ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్ అందించగలదని కంపెనీ తెలిపింది. మిడ్‌నైట్ బ్లాక్, డీప్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. వేరబుల్ స్మార్ట్‌వాచ్ Android 6.0/iOS 11, అంతకంటే ఎక్కువ వెర్షన్‌లకు అనుకూలంగా ఉంటుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : OnePlus Nord Watch : వన్‌ప్లస్ నార్డ్ వాచ్ ఫీచర్లు లీక్.. అన్ని హెల్త్ ఫీచర్లే.. మహిళల కోసం స్పెషల్ ఫీచర్ ఉందట..!