Redmi Note 11SE India : ఆగస్టు 26న రెడ్‌మి నోట్ 11SE వచ్చేస్తోంది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంత ఉండొచ్చుంటే?

Redmi Note 11SE India : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మి (Redmi) నుంచి కొత్త మోడల్ వస్తోంది. ఆగస్టు 26న భారత మార్కెట్లో Redmi Note 11SE స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. మరో 2 రోజుల్లో కంపెనీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా లాంచ్ కానుంది.

Redmi Note 11SE India : ఆగస్టు 26న రెడ్‌మి నోట్ 11SE వచ్చేస్తోంది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంత ఉండొచ్చుంటే?

Redmi Note 11SE India launch set for August 26, full specifications and sale date confirmed

Redmi Note 11SE India : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మి (Redmi) నుంచి కొత్త మోడల్ వస్తోంది. ఆగస్టు 26న భారత మార్కెట్లో Redmi Note 11SE స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. మరో 2 రోజుల్లో కంపెనీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా లాంచ్ కానుంది. Xiaomi Redmi Note 11SE స్పెషల్ పేజీని క్రియేట్ చేసింది. రెడ్ మి నోట్ 11SE స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి అన్ని స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఈ డివైజ్ Redmi Note 10Sని పోలి ఉంటుంది. Mi.com, Flipkart ద్వారా ఆగస్టు 31న అందుబాటులోకి రానుంది. Redmi Note 11SE 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Full HD+ రిజల్యూషన్, 1,100nits‌తో పనిచేస్తుంది. పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లేకు 90Hz లేదా 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు చేస్తుందో ఉందో లేదో తెలియదు.

హ్యాండ్‌సెట్ వాటర్ రెసిస్టెంట్ కోసం IP53 రేట్‌తో వస్తుంది. హుడ్ కింద MediaTek Helio G95 చిప్‌సెట్ ఉంది. 4G చిప్ పిక్సెల్ డివైజ్‌తో పాటు ఇప్పటికే సరికొత్త ఆండ్రాయిడ్ 13 OS అప్‌డేట్‌ను అందిస్తోంది. హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో రానుందని భావిస్తున్నారు. 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో పాటు హై-రెస్ ఆడియో సర్టిఫికేషన్ డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. ఫోటోగ్రఫీ విషయానికొస్తే.. క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64-MP వైడ్-యాంగిల్ కెమెరా, 8-MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2-MP మాక్రో కెమెరా, 2-MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి.

Redmi Note 11SE India launch set for August 26, full specifications and sale date confirmed

Redmi Note 11SE India launch set for August 26, full specifications and sale date confirmed

కెమెరా యాప్‌లో నైట్ మోడ్, AI పోర్ట్రెయిట్, 64MP మోడ్ ఫీచర్లు ఉన్నాయి. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 13-MP కెమెరా ఉంది. Redmi Note 11SE 5,000mAh బ్యాటరీతో రానుంది. కంపెనీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తోంది. Redmi Note 11 SE ధర రూ. 20వేల సెగ్మెంట్ కింద ఉండవచ్చని అంచనా. ఆగస్ట్ 31న అధికారికంగా ధర వెల్లడికానుంది. రాబోయే Redmi ఫోన్ 6GB RAM + 64GB స్టోరేజ్, 6GB RAM + 128GB, 8GB RAM + 128GB స్టోరేజ్‌తో సహా మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉండనుంది.

Read Also : Redmi K50i : వన్‌ప్లస్, ఒప్పోకు పోటీగా.. రెడ్‌మి K50i స్మార్ట్ ఫోన్.. టాప్ ఫీచర్లు ఇవే.. ధర ఎంతంటే?