Jio Plans: అంతకుమించి.. జియో రీఛార్జ్ చేసుకోండి.. డిస్నీ+ హాట్ స్టార్ అపరిమితంగా వాడేయండి

జియో యూజర్లకు అద్భుతమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చారు. వీటితో పాటు డిస్నీ+ హాట్ స్టార్స్ అన్‌లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చింది.

Jio Plans: అంతకుమించి.. జియో రీఛార్జ్ చేసుకోండి.. డిస్నీ+ హాట్ స్టార్ అపరిమితంగా వాడేయండి

Jio Recharge Plans

Jio Plans: జియో యూజర్లకు అద్భుతమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చారు. వీటితో పాటు డిస్నీ+ హాట్ స్టార్స్ అన్‌లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చింది. త్వరలో ఐపీఎల్ 2021 సెప్టెంబర్ 19 నుంచి తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో రిలయన్స్ జియో 5 సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. క్రికెట్ లవర్స్‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

డిస్నీ+ హాట్ స్టార్ కంటెంట్ లైబ్రరీ కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ అందించే కొత్త 5 ప్రీపెయిడ్ ప్లాన్లను జియో ప్రారంభించింది. గతంలో జియో డిస్నీ+ హాట్ స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ కింద లైవ్ స్పోర్ట్స్, హాట్ స్టార్ స్పెషల్స్, మూవీలు, టీవీ షోలకు మాత్రమే యాక్సెస్ లభించేది.

ఇప్పుడు అందిస్తున్న రిలయన్స్ జియో కొత్త ప్లాన్‌తో డిస్నీ+ హాట్ స్టార్ డిస్నీ+ ఒరిజినల్స్, డిస్నీ, మార్వెల్, స్టార్ వార్స్, నేషనల్ జియోగ్రాఫిక్, హెచ్ బీఓ, ఎఫ్ఎక్స్, షోటైమ్, ఇతర ఇంటర్నేషనల్ కంటెంట్ కొత్త లైబ్రరీ కూడా ఆస్వాదించవచ్చు. కొత్త రీఛార్జ్ ప్లాన్ ధరలు వరుసగా 28 రోజుల వ్యాలిడిటీతో రూ.499కు, 56 రోజుల వ్యాలిడిటీతో రూ.666కు, 84 రోజుల వ్యాలిడిటీతో రూ.888కు, 365 రోజుల వ్యాలిడిటీతో రూ.2వేల599కు అందుబాటులో ఉన్నాయి. రూ.499 రీఛార్జ్ ప్లాన్ కింద రోజుకు 3జీబీ డేటాను అందిస్తుండగా, మిగిలిన మూడు ప్లాన్స్ కింద రోజుకు 2 జీబీ డేటా లభిస్తాయి.

అదనంగా 1.5 జీబీ డేటా రోజూ కావాలంటే డేటా యాడ్-ఆన్ ప్లాన్ రూ.549ను రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. రూ.549 యాడ్-ఆన్ ప్లాన్ మినహా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు అన్‌లిమిటెడ్ వాయీస్, ఎస్ఎమ్ఎస్ బెనిఫిట్స్ దొరుకుతాయి.