TATA Group: టాటా గ్రూప్ కీలక నిర్ణయం.. భారత్‌లో ఐఫోన్‌ల తయారీపై దృష్టి.. విస్ట్రన్ కార్పొరేషన్‌తో చర్చలు..?

టాటా గ్రూప్ స్మార్ట్ ఫోన్‌ల తయారీ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. భారత్‌లో యాపిల్ ఐఫోన్ల తయారీని చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం తైవాన్ కు చెందిన విస్ట్రన్ కార్పొరేషన్ తో టాటా గ్రూప్ ప్రతినిధులు చర్చలు జరిపినట్లు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది.

TATA Group: టాటా గ్రూప్ కీలక నిర్ణయం.. భారత్‌లో ఐఫోన్‌ల తయారీపై దృష్టి.. విస్ట్రన్ కార్పొరేషన్‌తో చర్చలు..?

TATA Group

TATA Group: టాటా గ్రూప్ స్మార్ట్ ఫోన్‌ల తయారీ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. భారత్‌లో యాపిల్ ఐఫోన్ల తయారీని చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం తైవాన్ కు చెందిన విస్ట్రన్ కార్పొరేషన్ తో టాటా గ్రూప్ ప్రతినిధులు చర్చలు జరిపినట్లు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. ఫోన్ల ఉత్పత్తి, సప్లయ్ చైన్, అసెంబ్లింగ్ లో విస్ట్రన్ కార్పొరేషన్ నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని టాటా గ్రూప్ భావిస్తోందని సమాచారం. వీరి చర్చలు సఫలమైతే ఐఫోన్లను తయారు చేసే తొలి భారతీయ కంపెనీగా టాటా గ్రూప్ అవతరించనుంది.

Apple iPhone 11 Sale : అరే.. ఏంట్రా ఇది.. ఐఫోన్ 11 మోడల్ ఆపేసిన ఆపిల్.. ఫ్లిప్‌కార్ట్‌లో స్టాక్ ఉందిగా.. ఇప్పుడే కొనేసుకోండి.. ధర ఎంతంటే?

ప్రస్తుతం అధికశాతం కంపెనీలు ఫోన్ల తయారీ విషయంలో చైనాపైనే ఆధారపడుతున్నాయి. అమెరికాతో ఆ దేశం ఘర్షణలు, కొవిడ్ లాక్‌డౌన్ల నేపథ్యంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకొనేందుకు ఆయా కంపెనీలు నిర్ణయానికి వస్తున్నాయి. ఈ క్రమంలో యాపిల్ ఇతర దేశాల్లోనూ తయారీ చేపట్టాలని భావిస్తోంది. దీంతో టాటా గ్రూప్ విస్ట్రన్ గ్రూప్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. ప్రస్తుతం యాపిల్ కు చెందిన ఐఫోన్లను తైవాన్‌కు చెందిన విస్ట్రన్ కార్పొరేషన్, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్‌లు చేపడుతున్నాయి. భారత్, చైనాలో ఇవి ఐఫోన్లను అసెంబుల్ చేస్తున్నాయి.

iPhone 14 Price in India : ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ ధర.. విదేశాల్లో కన్నా భారత్‌లోనే ఎక్కువ.. ఏయే దేశాల్లో చౌకైన ధరకే లభిస్తుందో తెలుసా? ఇదిగో లిస్ట్..!

టాటా గ్రూప్, విస్ట్రన్ కార్పొరేషన్ ప్రతినిధుల మధ్యచర్చలో భాగంగా విస్ట్రన్ ఇండియాలో టాటా గ్రూప్ ఈక్విటీలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాకాని పక్షంలో రెండు కంపెనీలు కలిపి నూతన అసెంబ్లీ ప్లాంట్ ను ఏర్పాటు చేసే అవకాశముందని సమాచారం. ఈ రెండింటి మధ్య ఒప్పందం జరిగితే దేశంలో ఆపిల్ ఐఫోన్ల యొక్క విక్రయాలు ఐదు నుంచి ఆరు శాతం పెరిగేందుకు ఉపయోగపడుతుందని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ విషయంపై విస్ట్రన్ కార్పొరేషన్ కానీ, టాటా గ్రూప్, యాపిల్ కంపెనీల ప్రతినిధులు ఎవరూ స్పందించక పోవటం గమనార్హం.