WhatsApp in 2022 : ఈ ఏడాదిలో వాట్సాప్‌ బెస్ట్ ఫీచర్లు ఇవే.. ఏయే ఫీచర్లు ఎలా పనిచేస్తాయంటే?

WhatsApp in 2022 : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) నుంచి 2022 ఏడాదిలో అద్భుతమైన ఫీచర్లు రిలీజ్ అయ్యాయి. అందులో వాట్సాప్ (Android) యూజర్లు, ఐఓఎస్ (iOS) యూజర్ల కోసం అనేక ఫీచర్లనుఅందుబాటులోకి తీసుకొచ్చింది.

WhatsApp in 2022 : ఈ ఏడాదిలో వాట్సాప్‌ బెస్ట్ ఫీచర్లు ఇవే.. ఏయే ఫీచర్లు ఎలా పనిచేస్తాయంటే?

WhatsApp in 2022 _ Best features that were announced this year

WhatsApp in 2022 : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) నుంచి 2022 ఏడాదిలో అద్భుతమైన ఫీచర్లు రిలీజ్ అయ్యాయి. అందులో వాట్సాప్ (Android) యూజర్లు, ఐఓఎస్ (iOS) యూజర్ల కోసం అనేక ఫీచర్లనుఅందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ గ్రూప్ కాల్‌లో ఎక్కువ మంది పాల్గొనేలా వీడియో కాలింగ్‌ ఫీచర్ మెరుగుపర్చింది.

అలాగే, వాట్సాప్ ఇన్-చాట్ పోల్స్ వంటి ఫీచర్‌లను కూడా ప్రకటించింది. WhatsApp ఈ ఏడాదిలో అందించిన అత్యుత్తమ ఫీచర్లలోఒకటి.. ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ ఫీచర్.. ఇంకా మరెన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 2022 ఏడాదిలో వాట్సాప్ ప్రకటించిన కొన్ని బెస్ట్ ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

2022లో ప్రకటించిన వాట్సాప్ బెస్ట్ ఫీచర్లు ఇవే :
* వాట్సాప్ అత్యంత ఉపయోగకరమైన ఫీచర్లలో వీడియో కాల్ ఒకటిగా చెప్పవచ్చు.
* వీడియో కాల్‌లో గరిష్టంగా 32 మంది యూజర్లను యాడ్ చేసే సామర్థ్యాన్ని పొందవచ్చు.
* వాట్సాప్ (WhatsApp) మెసేజింగ్ యాప్‌లో మీ ఆన్‌లైన్ స్టేటస్ సామర్థ్యాన్ని అందిస్తుంది.
* మీ ఫోన్ సెట్టింగ్‌లలో ఈ ఫీచర్‌ ఎనేబుల్ చేయడం ద్వారా యూజర్ల ఆన్‌లైన్ స్టేటస్ ఇతరలు చూడలేరు. యాప్ ప్రైవసీ సెట్టింగ్‌లలో ఒకరు ఈ ఫీచర్‌ను చూడవచ్చు.
* వాట్సాప్ యూజర్లు తమ గ్రూపులలో సభ్యులుగా ఉండకూడదనుకుంటే నిశ్శబ్దంగా గ్రూప్‌ నుంచి ఎగ్జిట్ అయ్యేందుకు అనుమతిస్తుంది.
* ఇంతకుముందు, ఎవరైనా గ్రూప్ నుంచి నిష్క్రమిస్తే.. యాప్ అందరిని అలర్ట్ చేసేది.
* ఇప్పుడు, మీరు సైలెంట్‌గా గ్రూప్ నుంచి నిష్క్రమించినా గ్రూప్ అడ్మిన్‌కు తప్ప సభ్యులకు తెలియదు.
* వాట్సాప్‌ను నోట్‌ప్యాడ్‌ (Notepad)గా వాడేందుకు అనుమతించే Message Yourself ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.

WhatsApp in 2022 _ Best features that were announced this year

WhatsApp in 2022 _ Best features that were announced this year

Read Also : Update your WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్.. ఈ కొత్త ఫీచర్లను పొందాలంటే ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి..!

* వాట్సాప్ ప్రాథమికంగా మీ సొంత నంబర్‌తోనే మెసేజ్ పంపేందుకు అనుమతిస్తుంది.
* ఏమిటంటే వాట్సాప్ ముఖ్యమైన మెసేజ్‌లను పిన్ చేసేందుకు కూడా అనుమతిస్తుంది.
* వాట్సాప్ 2022లో యాడ్ చేసిన మరో ఫీచర్ ఏమిటంటే.. యాప్‌లోని నిర్దిష్ట యూజర్ల నుంచి ప్రొఫైల్ ఫొటోను హైడ్ చేయవచ్చు.
* ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కనెక్ట్ చేసేందుకు వీలుంది.
* WhatsAppలో తెలియని యూజర్ల నుంచి మీ వివరాలను హైడ్ చేయవచ్చు.
* ప్రైవసీ కోరుకునే యూజర్లు వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోను హైడ్ చేయాల్సిన అవసరం లేదు.
* ప్లాట్‌ఫారమ్ ఇప్పటికే స్టేటస్, లాస్ట్ సీన్ (Last Seen) ఇతర యూజర్ల వివరాలను హైడ్ చేసేందుకు అనుమతిస్తుంది.
* ఆండ్రాయిడ్ (Android), iOS యూజర్ల కోసం ఎమోజి ఫీచర్‌ను కూడా రిలీజ్ చేసింది.
* విభిన్న భావోద్వేగాలతో మెసేజ్ రియాక్షన్ చేసేందుకు ఈ ఫీచర్ మిమ్మల్ని అనుమతిస్తుంది.
* ఈ ఏడాదిలో స్కూళ్లు, వ్యాపారాలు, ఇతర సంస్థల కోసం కొన్ని అదనపు ఫీచర్‌లను యాడ్ చేసింది.
* యూజర్లు కమ్యూనికేట్ అయ్యేందుకు కమ్యూనిటీలు అనే సెక్షన్ కూడా యాప్‌లో యాడ్ చేసింది.
* చివరిగా, వాట్సాప్ 2022లో యాడ్ చేసిన ఇన్-చాట్ పోల్స్ ఫీచర్ (In-Chat Polls) కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
* మీరు చాట్‌లోని అటాచ్‌మెంట్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా పోల్‌లను సులభంగా క్రియేట్ చేయవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Message Yourself on WhatsApp : వాట్సాప్‌లో మీ నెంబర్‌కు మీరే మెసేజ్ చేసుకోవచ్చు తెలుసా? ఏదైనా సేవ్ చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!