CPR Baby : అప్పుడే పుట్టిన బిడ్డకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది

వైద్య అధికారుల సూచనల మేరకు రవి ఆమెకు అంబులెన్స్ లోనే ప్రసవం చేశారు. నెలలు నిండక, తక్కువ బరువు, బ్రీతింగ్, హార్ట్ బీట్ కూడా లేకుండా మగ బిడ్డ తల్లి గర్భం నుంచి బయటికి వచ్చింది.

CPR Baby : అప్పుడే పుట్టిన బిడ్డకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది

CPR Baby

CPR Baby : మేడ్చల్ మాల్కాజిగిరి జిల్లాలో 108 సిబ్బంది ఓ పసిబిడ్డ నిండు ప్రాణాలు కాపాడారు. అప్పుడే పుట్టిన బిడ్డకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. కీసర మండలం కుందన్ పల్లికి చెందిన ఆర్తికుమారికి శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆమెను కీసరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు కుడుపులో బిడ్డకు నెలలు నిండ లేదని, ఆపరేషన్ చేయాలని తెలిపారు.

పుట్టబోయే బిడ్డ ఎదుగుదల సరిగ్గా లేదని బిడ్డను ఐసీయూలో పెట్టాల్సివస్తుందని దానికి అధిక ఖర్చు అవుతుందని సూచించారు. తమ దగ్గర అంత డబ్బు లేదని చెప్పడంతో అయితే, గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. ఆర్తి కుమారి కుటుంబ సభ్యులు 108కు సమాచరాం ఇచ్చారు. ఆమెను 108 అంబులెన్స్ లోకి తీసుకుని ఈఎమ్ టీ చిత్రం రవి గ్లూకోజ్ ఎక్కిస్తూ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Pregnant Delivery in Train : దురంతో ఎక్స్‌ప్రెస్‌లో గర్భిణికి పురిటి నొప్పులు .. ఒట్టి చేతులతో సాధారణ ప్రసవం చేసిన డాక్టర్

మార్గంమధ్యలో నాగారం సమీపంలోకి వెళ్లగానే ఆమెకు పురిటి నొప్పులు అధికమయ్యాయి. వైద్య అధికారుల సూచనల మేరకు రవి ఆమెకు అంబులెన్స్ లోనే ప్రసవం చేశారు. నెలలు నిండక, తక్కువ బరువు, బ్రీతింగ్, హార్ట్ బీట్ కూడా లేకుండా మగ బిడ్డ తల్లి గర్భం నుంచి బయటికి వచ్చింది.

ఈ విషయాన్ని రవి ఉన్నతాధికారులకు వివరించి వారి సూచనలతో బిడ్డకు సీపీఆర్ చేస్తూ అంబూబ్యాగ్ తో బ్రీతింగ్ అందిస్తూ, ఆక్సిజన్ సరఫరా చేస్తూ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే సరైన సమయంలో సీపీఆర్ చేసి బిడ్డ ప్రాణాలు కాపాడారని 108 సిబ్బందిని గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రశంసించారు. ఆర్తి కుమారి కుటుంబ సభ్యులు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.