Corona Variant: 13మంది విదేశీ ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్

డిసెంబర్ 1 నుంచి హైదరాబాద్ చేరుకున్న 960మంది శాంపుల్స్ పరీక్షించగా 13మంది కొవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. కాకపోతే వేరియంట్ గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ఆ శాంపుల్స్‌ను జెనోమ్...

Corona Variant: 13మంది విదేశీ ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్

Omicron Variant

Corona Variant: డిసెంబర్ 1 నుంచి హైదరాబాద్ చేరుకున్న 960మంది శాంపుల్స్ పరీక్షించగా 13మంది కొవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. కాకపోతే వేరియంట్ గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ఆ శాంపుల్స్‌ను జెనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించామని.. ఆదివారం సాయంత్రం నాటికి ఫలితాలు తెలుస్తాయని డా. జీ శ్రీనివాసరావు, తెలంగాణ హెల్త్ డైరక్టర్ అన్నారు.

ఫ్రంట్‌లైన్ వర్కర్‌ల‌కు మరొక బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని శ్రీనివాసరావు చెప్పారు. చిన్న పిల్లలకు వాక్సినేషన్ ఇచ్చే విషయంపై  కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరామని ఆయన అన్నారు. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తప్పని సరిగా మాస్క్ ధరించాలని కోరారు.

సౌత్‌ఆఫ్రికా‌లో ప్రతి నలుగురిలో ఒక్కరి‌కే వాక్సినేషన్ జరిగిందని….అందుకే అక్కడ కొత్త వేరియేంట్ పుట్టుకు  వచ్చిందని శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో భవిష్యత్తులో లోక్‌డౌన్ పెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. ఓమిక్రాన్ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుంది కానీ, ఓమిక్రాన్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు వుండటం  లేదని ఆయన తెలిపారు. తీవ్ర ఒళ్ళు నొప్పులు, నీరసం, తలనొప్పి వంటి లక్షణాలు ఓమిక్రాన్ సోకిన వారికి ఉంటాయి. కానీ టిమ్స్ లో చేరిన అనుమానిత కేసుల్లో ఎవరికీ లక్షణాలు లేవని ఆయన వివరించారు.

………………………………………. : భారత్ మరో ఘనత..50శాతం మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తి
కేసులు దాస్తున్నామన్న వార్తల్లో వాస్తవం లేదని కొవిడ్ థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోటానికి ప్రభుత్వం సిధ్ధంగా ఉందని ఆయన చెప్పారు.