Bomb Blast : అదొక చీకటి రోజు, విషాదం జరిగి 14 ఏళ్లు..నిందితులకు శిక్ష అమలయ్యేదెప్పుడు ?

భాగ్యనగర వాసులకు అదొక చీకటి రోజు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోలేని రోజు. 2007 సంవత్సరం సరిగ్గా ఇదే రోజు జరిగిన ఘటన.. ఇంకా మానని గాయంలానే ఉండిపోయింది.

Bomb Blast : అదొక చీకటి రోజు, విషాదం జరిగి 14 ఏళ్లు..నిందితులకు శిక్ష అమలయ్యేదెప్పుడు ?

Gokul

Gokul Chat And Lumbini Park : భాగ్యనగర వాసులకు అదొక చీకటి రోజు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోలేని రోజు. 2007 సంవత్సరం సరిగ్గా ఇదే రోజు జరిగిన ఘటన.. ఇంకా మానని గాయంలానే ఉండిపోయింది. నేటికి ఆ విషాదం జరిగి 14 ఏళ్లు. సాయంత్రం వేళ ఒక్కసారిగా హైద‌రాబాద్ ఉలిక్కిపడింది. రెండు నిమిషాల వ్యవ‌ధిలో జరిగిన పేలుళ్లతో ఒక్కసారిగా షాక్‌కు గురైంది. లుంబినీ పార్క్ లేజర్ షో వద్ద.. కోఠిలోని గోకుల్ చాట్ వద్ద రెండు బాంబులు భారీ శ‌బ్దంతో పేలాయి. ఈ దుర్ఘటనలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ జంట పేలుళ్లలో 42 మంది అమాయక ప్రజలు మృతి చెందారు. వంద మందికి పైగా క్షతగాత్రులయ్యారు.

Read More : Govt Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలోనే ఉద్యోగాల భర్తీ , నోటిఫికేషన్లు

పేలుళ్ల తర్వాత సిటీలోని ర‌ద్దీ ప్రాంతాల్లో సోదాలు చేసిన‌ పోలీసులు.. 19 బాంబులను గుర్తించి వాటిని పేలకుండా నిర్వీర్యం చేశారు. పేలుళ్లకు పాల్పడిన నిందితులకు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు నిందితులకు ఎన్‌ఐఏ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో ఏ-1 గా ఉన్న హానిక్ షఫిక్ సయ్యద్, ఏ-2 మహమ్మద్ ఇస్మాయిల్ చౌదరిలను ఎన్‌ఐఏ కోర్టు దోషిగా తేల్చింది. ఇండియన్ ముజాహిదీన్ సంస్థ పేలుళ్లకు పాల్పడింది.

Read More : Srisailam : శ్రీశైలంలో కొనసాగుతున్న శ్రావణ మాస పూజలు

కోర్టు శిక్ష ఖరారు చేసినప్పటికీ ఇప్పటి వరకు తీర్పు మాత్రం అమలు కాలేదు. దారుణం జరిగి 14 ఏళ్లు గడిచినా నిందితులకు శిక్ష అమలు కాలేదు. ఎంతోమంది అమాయకులను పొట్టనపెట్టుకున్న కిరాతకులు.. ఇంకా జైల్లోనే జీవిస్తున్నారు.  నిందితులైన అక్బర్, అనీఖ్, అన్సార్‌ను పోలీసులు 2008 అక్టోబర్‌లో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 2009లో హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఇక్కడి కోర్టులో హాజరుపరిచారు. పేలుళ్లు జరిపింది తామేనని అంగీకరించారు. ఈ కేసులో నిందితులైన మరో 8 మంది పరారీలో ఉన్నారు. ఈ జంటపేలుళ్ల వ‌ల్ల గాయ‌ప‌డిన కొంద‌రు ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఆనాటి భయంక‌ర ప‌రిస్థితుల‌ను గుర్తు చేసుకుంటూ విలపిస్తున్నారు. నిందితులకు ఎప్పుడు శిక్ష అమలవుతుందానని ఎదురుచూస్తున్నారు.