హైదరాబాద్ లో కూలిన పాత భవంతి..తప్పించుకున్న మహిళ, వీడియో వైరల్

  • Published By: madhu ,Published On : October 15, 2020 / 11:35 AM IST
హైదరాబాద్ లో కూలిన పాత భవంతి..తప్పించుకున్న మహిళ, వీడియో వైరల్

A woman’s narrow escape : హైదరాబాద్ లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. కుండపోతగా కురిసిన వర్షంతో వరద పోటెత్తింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇంకా నీటిలో పలు కాలనీలున్నాయి. రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. నగరంలో జన జీవన స్తంభించిపోయింది. ట్రాన్స్ ఫార్మర్లు, వాహనాలు నీటిలో కొట్టుకపోయాయి. కొంతమంది వీటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.



మొఘల్ పురా ప్రాంతంలో ఓ పాత భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. ఈ సమయంలో అక్కడి నుంచి ఓ మహిళ నడుస్తూ వెళుతోంది. క్షణంలో ఆమె తప్పించుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.



వరద ముంపు నుంచి హైదరాబాద్‌ నగరం ఇప్పుడే కోలుకునేలా లేదు. నగరంలోని పలు ప్రాంతాలు ఇంకా నీటిముంపులోనే ఉండిపోయాయి. సరూర్‌నగర్‌ చెరువు కట్ట తెగడంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. దాదాపు 36గంటలకు పైగా కాలనీలు నీటిలో నానుతున్నాయి. నిత్యావసరాలు కూడా దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచినీరు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.