వెళ్లి రావయ్యా..బొజ్జ గణపయ్య, నిమజ్జనానికి ఏర్పాట్లు

  • Published By: madhu ,Published On : September 1, 2020 / 06:47 AM IST
వెళ్లి రావయ్యా..బొజ్జ గణపయ్య, నిమజ్జనానికి ఏర్పాట్లు

గణపతి బప్ప మోరియా..జై బోలో గణేష్ మహరాజ్ కి జై నినాదాలతో వినాయకుడికి వీడ్కోలు పలుకుతున్నారు. కానీ ఎప్పుడూ లేని విధంగా..గణేష్ నిమజ్జనం జరుగుతోంది. కరోనా కారణంగా..చాలా సింపుల్ గా పండుగలు నిర్వహించుకంటున్నారు.



నిమజ్జన వేడుకలపై అధికారులు ఆంక్షలు విధించారు. గంగమ్మ ఒడికి గణనాథులు తరలుతున్నారు. ఊరేగింపు, నిమజ్జనం కోసం పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. బాలాపూర్‌ గణేశ్‌ నిమజ్జనం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.

సీసీ కెమెరాలతో పాటు హ్యాండ్‌ హెల్డ్‌ కెమెరాలను వాడి ప్రతి ఘట్టాన్నీ చిత్రీకరించనున్నారు. బందోబస్తు కోసం నగర పోలీసులతో పాటు సాయుధ బలగాలూ మోహరించనున్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో మాస్క్‌లు, శానిటైజర్లు, ఫేస్‌షీల్డ్స్‌ అందిస్తున్నారు. పోలీసు అధికారులు ఇతర విభాగాలతో పాటు శాంతి, మైత్రి సంఘాలతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తున్నారు.



హుస్సేన్‌సాగర్‌ వచ్చే గణనాథులు : హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలతో పాటు శివారులోని మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని విగ్రహాలు.
నిమజ్జనం జరిగే ప్రదేశాలు : ట్యాంక్‌బండ్, రాజన్న బౌలి, మీరాలం ట్యాంక్, ఎర్రకుంట చెరువు, షేక్‌పేట చెరువు, సరూర్‌నగర్‌ మినీ ట్యాంక్‌బండ్, సఫిల్‌గూడ/మల్కాజ్‌గిరి చెరువులు, హస్మత్‌పేట చెరువు.
https://10tv.in/india-china-need-to-follow-mutually-agreed-reciprocal-actions-to-restore-peace-at-border-mea/
ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుందని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. టెలిఫోన్‌ భవన్‌, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా ట్యాంక్ బండ్‌లోని క్రేన్‌ నెంబర్‌ 4 దగ్గరకు ఈ శోభాయాత్ర చేరుకుంటుందని చెప్పారు. తర్వాత వినాయకుడి నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. ఊరేగింపునకు భక్తులెవరు రావద్దని పిలుపు నిచ్చారు.