IIT Hyderabad Student : ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి రూ.63.78 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ

ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులకు ఈ ఏడాది తొలి విడత ప్లేస్ మెంట్స్ లో మంచి వేతన ప్యాకేజీలు లభించాయి. ఐఐటీహెచ్ కు చెందిన విద్యార్థికి అత్యధికంగా రూ.63.78 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ దక్కింది. ఐఐటీహెచ్ విద్యార్థులు సాధించిన వార్షిక సగటు వేతన ప్యాకేజీ రూ.19.49 లక్షలుగా ఉంది.

IIT Hyderabad Student : ఐఐటీ హైదరాబాద్ విద్యార్థికి రూ.63.78 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ

IIT Hyderabad

IIT Hyderabad Student : ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులకు ఈ ఏడాది తొలి విడత ప్లేస్ మెంట్స్ లో మంచి వేతన ప్యాకేజీలు లభించాయి. ఐఐటీ హెచ్ చెందిన విద్యార్థికి అత్యధికంగా రూ.63.78 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ దక్కింది. ఐఐటీహెచ్ విద్యార్థులు సాధించిన వార్షిక సగటు వేతన ప్యాకేజీ రూ.19.49 లక్షలుగా ఉంది. ఐఐటీహెచ్ విద్యార్థులను రిక్రూట్ మెంట్ చేసుకునేందుకు స్వదేశీ కంపెనీలతో పాటు బహుళజాతి సంస్థలు కూడా ఆసక్తి చూపించాయి. విదేశీ స్టార్టప్ కంపెనీలూ పోటీ పడ్డాయి. దీంతో ఐఐటీ హెచ్ విద్యార్థులు ప్లేస్ మెంట్ ధమాకా పొందారు. డిసెంబర్ 1 నంచి 7వ తేదీ వరకు మొదటి విడత ప్లేస్ మెంట్ డ్రైవ్ నిర్వహించారు.

ఈ విడతలో మొత్తం 700 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వీరిలో 508 మంది 144 కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించారు. వీరిలో 54 మంది అంతర్జాతీయ కంపెనీలకు మాత్రమే ఎంపికయ్యారు. గతేడాది 12 అంతర్జాతీయ కంపెనీలు మాత్రమే ప్లేస్ మెంట్ డ్రైవ్ లో పాల్గొన్నాయి. ఈ ఏడాది 13 కంపెనీలు పాల్గొన్నాయి. ఐఐటీహెచ్ లోని మొదటి గ్రాడ్యుయేషన్ బ్యాచ్ కు చెందిన బీటెక్ ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ విద్యార్థుల్లో 82శాతం మంది ప్లేస్ మెంట్ దక్కించుకున్నారు.

Hyderabad IIT Recruitment : హైదరాబాద్ ఐఐటీలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ

సెమిస్టర్ లాంగ్ ఇంటర్న్ షిప్ లు సైతం గతం కన్నా పెరిగాయి. గతేడాది 33 ఇంటర్న్ షిప్ లు ఉంటే ఈ ఏడాది 51కి పెరిగాయి. బ్లెండ్ 360 కంపెనీ అత్యధికంగా ఐఐటీహెచ్ విద్యార్థులను రిక్రూట్ మెంట్ చేసుకుంది. యాక్సెంచర్ జపాన్, డెన్సో, ఫ్లిప్ కార్ట్, మోర్గాన్ స్టాన్లీ, ఎన్ టీటీఏటీ, ఒరాకిల్, స్ప్రింక్లర్,
సుజుకి మోటర్స్ కార్పొరేషన్, టెక్సాస్ ఇన్ స్ట్రుమెంట్స్, టీఎస్ఎంసీ, జోమా టో తదితర సంస్థలు రిక్రూట్ మెంట్ చేసుకున్నారు. మొదటి విడత ప్లేస్ మెంట్స్ ముగిసింది.

రెండో విడత ప్లేస్ మెంట్ జనవరిలో ప్రారంభమవుతాయని ఐఐటీహెచ్ కెరీర్ సర్వీసెస్ ఫ్యాకల్టీ ఇన్ చార్జీ డాక్టర్ అభివన్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఏడాది అత్యుత్తమ ప్లేస్ మెంట్స్ ను దక్కడం సంతోషదాయమని ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అన్నారు. బలమైన ఫండెమెంటల్స్ తో పరిశ్రమలకు అవసరమైన ప్రతిభను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ ప్రయత్నమే విద్యార్థుల కలలను నెరవేర్చే అత్యుత్తమ ప్యాకేజీలను చేరువచేస్తుందని చెప్పారు.