Bandi Sanjay Kumar: బీజేపీ ప్రభుత్వం నిజంగా ఈడీని వాడుకోవాలని చూస్తే.. తెలంగాణలో వాళ్లుండరు

బీజేపీ ప్రభుత్వం నిజంగా ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్)ని వాడుకోవాలని చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

Bandi Sanjay Kumar: బీజేపీ ప్రభుత్వం నిజంగా ఈడీని వాడుకోవాలని చూస్తే.. తెలంగాణలో వాళ్లుండరు

Bandi Sunjay

Updated On : August 14, 2022 / 3:50 PM IST

Bandi Sanjay Kumar: బీజేపీ ప్రభుత్వం నిజంగా ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్)ని వాడుకోవాలని చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మోత్కూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్ పారిపోయాయని అన్నారు. కేసీఆర్ బొమ్మ పెట్టుకొని తిరిగితే ఓట్లు పడే రోజులు పోయాయని, తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ విధానాలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని సంజయ్ విమర్శించారు. కమ్యూనిస్టులు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదని, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని అన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ విమర్శించలేదని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మాత్రమే విమర్శించారని సంజయ్ అన్నారు.

Revanth Reddy Munugodu By-Election : మునుగోడు ఉపఎన్నికపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ప్రజా సంగ్రామ యాత్రలకు భయపడే పెన్షన్లు, చేనేత బీమా, ఇతర పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని సంజయ్ అన్నారు. హత్యలు, అత్యాచారాలు, డ్రగ్స్, ఇసుక మాఫియాకు కేరాఫ్ టీఆర్ఎస్ గా మారిందని సంజయ్ ఘాటుగా విమర్శించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ విషయంపై సంజయ్ స్పందిస్తూ .. మంత్రులు గాల్లోకి కాల్పులు జరుపుతుంటే రజాకార్ల పాలన మళ్లీ వచ్చిందా అని అనినిపిస్తోందని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు,మంత్రులు లైసెన్స్‌డ్‌ గుండాలు అయిపోయారని తీవ్రస్థాయిలో విమర్శించారు.

A poster featuring Tipu Sultan: టిప్పు సుల్తాన్ పోస్టర్‌ను చించి పడేసిన యువకులు.. ఉద్రిక్తత.. వీడియో

టీఆర్‌ఎస్‌కు అనుసంధానంగా ఉన్న అధికారుల లిస్ట్‌ తీస్తున్నామని, అధికారంలోకి వచ్చాక వాళ్ల సంగతి చూస్తామంటూ బండి సంజయ్ హెచ్చరించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాతో టచ్‌లో ఉన్నాడని నేను ఎప్పుడు అనలేదని బండి సంజయ్‌ అన్నారు.