ఫేమస్ అయిపోయిన బాన్సువాడ బుడ్డోడు, బండి సంజయ్ సెల్ఫీ

ఫేమస్ అయిపోయిన బాన్సువాడ బుడ్డోడు, బండి సంజయ్ సెల్ఫీ

Banswada Kid : బాన్సువాడ బుడ్డోడు ఫేమస్ అయిపోయాడు. బీజేపీ నిర్వహించిన ఓ బహరంగసభలో నానా హంగామా చేశాడు. బీజేపీ నేతల స్పీచ్ కు కేకలతో సందడి చేశాడు. సభలో ఈ బుడ్డోడు చేసిన హంగామా..ను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అయ్యింది. దీంతో..పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ బుడ్డోడిని పిలిపించుకుని మాట్లాడారు. హైదరాబాద్ కు వచ్చిన ఆ బుడ్డోడితో సెల్ఫీ దిగి ముచ్చటించారు. అనంతరం అతడితో కలిసి భోజనం కూడా చేశారు. కొత్త  బట్టలు ఇచ్చారు.

నర్సింహ ఇంటి అద్దె, చదువుల ఖర్చు మొత్తం బీజేపీ పార్టీ చూసుకుంటుందని బండి సంజయ్ వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయిస్తామని, చదువు బాధ్యతలను ఎంపీ అరవింద్ చూసుకుంటారని వెల్లడించారు. అతని ఉన్న బాధను వెళ్లగక్కాడని తెలిపారు.

ఈ వీడియోను తాను 50 సార్లకంటే ఎక్కువగా చూశానన్నారు. పేదరికంతో ఉన్న వారు పేదరికంతో బాధ పడుతున్నారని, డబ్బున్నోడు..కోటీశ్వరుడు అవుతున్నాడన్నారు. బాన్సువాడలో బీజేపీ బహిరంగసభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకపడ్డారు. బండి సంజయ్, అరవింద్ స్పీచ్ లకు ఈ బుడ్డోడు కేకలు వేస్తూ..తొడ గొడుతూ..నానా హంగామా చేశాడు.