Basara IIIT Staff Bath : బాసర ట్రిపుల్ ఐటీలో మరో అరాచకం.. వంట గదిలోనే సిబ్బంది స్నానాలు.. వీడియో వైరల్

బాసర ట్రిపుల్ ఐటీలో మరో అరాచకం బయటపడింది. విద్యార్థులకు వండి పెట్టే వంటగదిని బాత్రూమ్ గా మార్చేశారు సిబ్బంది. భండార్ మెస్ లోని సిబ్బంది స్నానాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వంట గిన్నెల పక్కనే స్నానం చేస్తున్న సిబ్బందిని వీడియోలో రికార్డ్ చేశారు విద్యార్థులు.

Basara IIIT Staff Bath : బాసర ట్రిపుల్ ఐటీలో మరో అరాచకం.. వంట గదిలోనే సిబ్బంది స్నానాలు.. వీడియో వైరల్

Basara IIIT Staff Bath : బాసర ట్రిపుల్ ఐటీలో మరో అరాచకం బయటపడింది. విద్యార్థులకు వండి పెట్టే వంటగదిని బాత్రూమ్ గా మార్చేశారు సిబ్బంది. భండార్ మెస్ లోని సిబ్బంది స్నానాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వంట గిన్నెల పక్కనే స్నానం చేస్తున్న సిబ్బందిని వీడియోలో రికార్డ్ చేశారు విద్యార్థులు. అంతేకాదు ఇకపై తాము రోజూ ఇక్కడే స్నానాలు చేస్తామని మెస్ సిబ్బంది చెప్పడం విశేషం.

వీడియోలను విద్యార్థులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. మెస్ సిబ్బంది తీరుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవల తరుచుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం, ఇప్పుడు మెస్ లోనే స్నానాలు చేస్తుండటం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

Basara IIIT : రంగంలోకి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు.. మంత్రి సబితకు వార్నింగ్

బాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవల తరుచుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం, విద్యార్థులు అస్వస్థతకు గురవడం, దీనిపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం వంటి పరిణామాలు జరిగాయి. ఇవి మరువక ముందే మరో దారుణం వెలుగుచూసింది. మెస్ సిబ్బంది ఏకంగా వంట గదిని బాత్ రూమ్ గా మార్చేసిన వీడియో ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.

బాసర ట్రిపుల్ ఐటీలో కొన్ని రోజుల నుండి మెస్‌లలో విద్యార్థులకు వడ్డించే భోజనంలో పురుగులు రావడం, ఇటీవలే ఫుడ్ పాయిజన్‌ జరిగి పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురవడం కలకలం రేపాయి. ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగానే సంజయ్‌ అనే విద్యార్థి మరణించాడని, అక్కడ భోజనం చేసిన నాటి నుంచే అనారోగ్యం బారిన పడ్డాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

IIIT Basara Students Protests : బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆడియో కలకలం

ఇంత జరుగుతున్నా అక్కడి సిబ్బంది మాత్రం నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. ఏకంగా కిచెన్లలోనే స్నానాలు చేస్తూ విద్యార్థుల కంటపడ్డారు. ఓవైపు వంట చేస్తూ.. మరోవైపు సిబ్బంది స్నానాలు చేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. కలుషిత నీటితో వంట చేస్తున్నారని విద్యార్థుల ఆరోపిస్తున్నారు. కేంద్రీయ బండార్ మెస్లో స్నానాలు చేస్తున్న దృశ్యాలను విద్యార్థులు బయటపెట్టారు.

ఇటీవల కూడా బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో యూనివర్సిటీలో ఆందోళనలు చెలరేగాయి. తరచూ ఫుడ్ పాయిజన్ అవుతోందని, హాస్టల్ మెస్ కాంట్రాక్టర్‌ను మార్చాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. యూనిర్సిటీకి పూర్తి స్థాయి వీసీ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఫుడ్ పాయిజన్‌ జరిగి విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో మరోసారి అలాంటి ఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ట్రిపుల్ ఐటీ అధికారులు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా విద్యార్థుల్లో భరోసా నింపేందుకు.. డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు వడ్డించే ఆహారాన్ని వారి సమక్షంలోనే తిన్నారు. అనంతరం వంటకు వినియోగించే సరుకులను డైరెక్టర్‌ తనిఖీ చేశారు. గతంలో పొరపాట్లు జరిగి ఉండొచ్చని, కానీ ఇక ముందు విద్యార్థులకు నాణ్యత గల ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు డైరెక్టర్‌ సతీష్‌ తెలిపారు. అధికారులు తనిఖీలు చేసి విద్యార్థులకు భరోసా ఇచ్చిన గంటల వ్యవధిలోనే మెస్‌లో సిబ్బంది స్నానాలు చేస్తూ బయటపడడం దుమారం రేపుతోంది.

దీనిపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ట్రిఫుల్ ఐటీ అధికారుల తీరుని తప్పుపడుతున్నారు. ఎంతసేపు నోటి మాటలు, హామీలతోనే సరిపెడుతున్నారని.. సమస్యల పరిష్కారాన్ని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటున్నారు. సరైన తిండి లేక, వసతులు లేక అవస్థలు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. పర్మినెంట్ వీసీని నియమించి.. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.