Basara IIIT : రంగంలోకి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు.. మంత్రి సబితకు వార్నింగ్

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతుగా తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లోని ఓ హోటల్ లో సమావేశం అయిన పేరెంట్స్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తమ పిల్లలు చదువుకోవాలా? లేక పోరాటాలు చేయాలా? అని తల్లిదండ్రులు ప్రశ్నించారు.

Basara IIIT : రంగంలోకి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు.. మంత్రి సబితకు వార్నింగ్

Basara Iiit

Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతుగా తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లోని ఓ హోటల్ లో సమావేశం అయిన పేరెంట్స్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పోలీసులు చర్చలు జరిపారు. తమ పిల్లలు చదువుకోవాలా? లేక పోరాటాలు చేయాలా? అని తల్లిదండ్రులు పోలీసులను ప్రశ్నించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. వారికి మద్దతుగా తల్లిదండ్రులు రంగంలోకి దిగారు. తమ పిల్లలు చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ఆదివారం ఉదయం విద్యార్థుల పేరెంట్స్ సమావేశం అయ్యారు. దీనిపై ప్రభుత్వం ఓ స్పష్టత ఇవ్వకపోతే తాము ఆందోళన చేస్తామన్నారు. మంత్రి సబితను కలిసి తమ బాధలు చెప్పుకుంటామన్నారు.

Basara IIIT Water Cut : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తాగునీరు కట్..!

”రెండు నెలల నుంచి ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పరిస్థితి ఘోరంగా ఉంది. పిల్లలు ఆందోళనకు దిగి డిమాండ్లు పెడితే ప్రభుత్వం దిగివచ్చింది. 45 రోజుల్లో విద్యార్థుల డిమాండ్లు తీరుస్తామని మంత్రి సబిత హామీ ఇచ్చారు. కానీ, ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. పిల్లలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు. విద్యాశాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదు.

IIIT Basara Students Protests : బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆడియో కలకలం

రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు. నాణ్యమైన విద్య, భోజనం అందించాలి. రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయించి అభివృద్ధి చేయండి. పిల్లల అడిగిన 12 డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి. 45 రోజులు సమయం అయిపోయింది. కానీ ఇంతవరకు స్పందన లేదు. ఇక చూస్తూ ఊరుకునేది లేది. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులు డిమాండ్లు నెరవేర్చకపోతే మేము కూడా ఆందోళనకు దిగుతాం” అని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు.

Basara IIT: ఇది మీ ప్రభుత్వం.. ఆందోళన విరమించండి.. విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ..