Bathukamma Sarees : 18 ఏళ్లు నిండిన వారందరికీ చీరలు

బతుకమ్మ పండుగ కానుకగా మహిళలు, యువతకులకు ఇచ్చే చీరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత కార్డుల్లో పేరు నమోదై ఉండి, 18 ఏళ్లు న

Bathukamma Sarees : 18 ఏళ్లు నిండిన వారందరికీ చీరలు

Bathukamma Sarees

Bathukamma Sarees : బతుకమ్మ పండుగ కానుకగా మహిళలు, యువతకులకు ఇచ్చే చీరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత కార్డుల్లో పేరు నమోదై ఉండి, 18 ఏళ్లు నిండిన వారందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా చీరలను పంపిణీ చేయడానికి వీలుగా జిల్లాలకు సరుకును పంపించే ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభమైంది.

కాగా బతుకమ్మ చీరల పంపిణీకి కేంద్రాలను రేషన్‌ దుకాణాల వారీగా ఏర్పాటు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జిల్లాల్లో కలెక్టర్లు దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాలంది. చీరల పంపిణీ కోసం మండల, నియోజకవర్గ స్థాయిలో ఇంచార్జిలను నియమించాలని సూచించింది. పంపిణీ చేసిన తర్వాత మిగిలిన చీరలను అక్టోబరు 31వ తేదీలోగా గోడౌన్లకు చేర్చాలని, వాటిని నవంబర్ 15లోగా స్వాధీనం చేసుకోవాలని టెస్కోను ప్రభుత్వం ఆదేశించింది.

తెలంగాణ ప్రభుత్వం ఏటా బతుకమ్మ పండక్కి తెల్ల రేషన్ కార్డుదారులకు చీరలు ఇస్తోంది. సిరిసిల్ల నేతన్నల చేతుల్లో ఈ చీరలు రూపొందాయి. మహిళలకు పండుగ కానుక అందించడమే కాదు నేత కార్మికులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘బతుకమ్మ చీరలు’ పంపిణీ కార్యక్రమం చేపట్టింది.

బతుకమ్మ చీరలను ఆకర్షణీయమైన రంగుల్లో బంగారు, వెండి జరీ అంచులతో, 287 డిజైన్లతో 100 శాతం పాలిస్టర్‌ ఫిలమెంట్‌ నూలుతో తయారు చేశారు. సాధారణ చీరలను 6.30 మీటర్లు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని వయోవృద్ధులైన మహిళల కోసం 9 మీటర్ల పొడవైన చీరలను తయారు చేశారు. కాగా, బతుకమ్మ చీరల తయారీ ద్వారా వేల మంది కార్మికులకు ఉపాధి లభించింది.