Musi River : మూసీ కొత్త అందాలు..నదిపై వంతెనలు, అందమైన గార్డెన్లు, బోటింగ్

మూసీ పరిసరాల్లో సుందరీకరణ ప్రారంభమైంది. చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, బోటింగ్ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మూసీ అభివృద్ధి కార్యక్రమాలకు మూసీ రివర్ డెవలప్‌మెంట్ ఏర్పాటు చేసింది.

Musi River : మూసీ కొత్త అందాలు..నదిపై వంతెనలు, అందమైన గార్డెన్లు, బోటింగ్

Musi

Beautification of Musi River : మూసీ కొత్త అందాలు సంతరించుకోనుంది. నదిని, పరిసరాలను పర్యాటక స్వర్గధామంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. సమగ్ర అభివృద్ధితో…మూసీ రూపురేఖలు మార్చేయనుంది. మూసీ అంటే…మురుగు కాదని…ఆహ్లాదాన్నందించే…జలగళగళల సిరులని అందరూ భావించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నదిలో విహరిస్తూ..చుట్టుపక్కల అందాలు తిలకిస్తూ…ప్రయాణికులు, పర్యాటకులు సేదతీరనున్నారు. అంతే కాదు…పాత, కొత్త నగరాల అనుసంధానకర్తగా మారనుంది మూసీ. చారిత్రక డెక్కన్ నిర్మాణశైలిలో నదిపై వంతెనలు నిర్మించనున్నారు.

ఇప్పటికే మూసీ పరిసర ప్రాంతాల్లో సుందరీకరణ ప్రారంభమైంది. చెక్‌డ్యామ్‌లు నిర్మాణం, బోటింగ్ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. మూసీ అభివృద్ధి కార్యక్రమాల కోసం మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుచేసింది. మూసీలో ఉన్న పొదలు తొలగించడం, మురుగునీరు నిల్వ ఉండకుండా పారించడం, చెత్త, ఇతర వ్యర్థాలు మూసీలో కలవకుండా జాగ్రత్తపడడం వంటివి మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బాధ్యతలు. చెక్‌డ్యాంల నిర్మాణం శరవేగంగా పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో వాక్‌వేలు కూడా నిర్మించనుంది.

Murder : పెళ్లి చేయమని అడిగిన తమ్ముడిని హత్య చేసిన అన్న

ప్రస్తుతం మూసీపై 20 వరకు వంతెనలు ఉన్నాయి. రోజూ 30లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పదేళ్లలో ఈ సంఖ్య 60 లక్షలకు చేరుతుందని అంచనా. ఈ రద్దీని తట్టుకునేలా పాత వంతెనల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు..కొత్త వంతెనల నిర్మాణంతో పాత, కొత్త నగరాలకు కనెక్టివిటీ పెంచాలని అధికారులు నిర్ణయించారు. కొత్తగా 16 ప్రాంతాల్లో మూసీపై వంతెనలు నిర్మించనున్నారు.

అప్జల్ గంజ్, మూసారంబాగ్, చాదర్ ఘాట్, ఉప్పల్ భగాయత్ లే అవుట్, ప్రతాప సింగారం, అత్తాపూర్, చింతల్ మెట్, మంచిరేవుల, రాందేవ్ గూడ, హైదర్ షాకోట్, బండ్లగూడ వంటి ప్రాంతాల్లో ఈ వంతెనలు నిర్మిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అతి తక్కువ ఎత్తులో ఉన్న వంతెనలు, మరికొన్ని ప్రాంతాల్లో హై లెవల్ వంతెలను నిర్మించనున్నారు.

Sitaram Yechury : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగించిన కేంద్రం : సీతారాం ఏచూరి

చెక్‌డ్యామ్‌లు నిర్మించి నీటిని నింపడం ద్వారా అక్కడ బోటింగ్ ఏర్పాటు చేస్తే…పర్యాటకులు పోటెత్తుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కొత్తగా నిర్మించబోయే బ్రిడ్జిల కింది భాగంలో ఈ చెక్‌ డ్యాంలు నిర్మించే విషయాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ నాలుగు, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నాలుగు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏడు బ్రిడ్జిలు నిర్మించనునంది. చారిత్రక భావన కలిగేలా 398 కోట్ల రూపాయల ఖర్చుతో వీటిని నిర్మించనుంది. మొత్తానికి అందమైన గార్డెన్లు, ఇంకా అందమైన వంతెనలు, వాక్‌వేలతో మూసీ ముఖచిత్రం మారిపోనుంది.