Bandi Sanjay: చండూరు బహిరంగ సభే.. సీఎం కేసీఆర్ రాజకీయ జీవితానికి సమాధి కాబోతుంది..

సీబీఐ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. తప్పు చేయకుంటే ఎందుకంత భయం, తప్పు చేయకుంటే విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారు? అని సంజయ్ ప్రశ్నించారు. లిక్కర్ కేసు రాగానే జీవో 51 ఇచ్చారంటూ ఆరోపించారు.

Bandi Sanjay: చండూరు బహిరంగ సభే.. సీఎం కేసీఆర్ రాజకీయ జీవితానికి సమాధి కాబోతుంది..

bandi sunjay

Bandi Sanjay: మునుగోడు అభివృద్ధిపై రాజగోపాల్ రెడ్డి చేసిన సవాల్‌కు నేడు చండూరులో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ స్పందించాలని, ఎనిమిదేళ్లలో మునుగోడుకు ఏం చేశారో, ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని బీజేపీ క్యాంపు కార్యాలయంలో సంజయ్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు తెరాస ఎన్ని డ్రామాలకైనా తెరతీస్తుందని విమర్శించారు. ఓటర్లను కొనుగోలు చేసేందుకు సీఎం కాన్వాయ్ లోనే డబ్బు తరలిస్తారని సంజయ్ ఆరోపించారు.

CBI-Telangana: తెలంగాణలో సీబీఐ దర్యాప్తులకు అనుమతి ఉపసంహరణ.. ఆగస్టు 30నే జీవో విడుదల

గడిచిన ఎనిమిదేళ్లలో మునుగోడు నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధి ఏంటో బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రజలకు వివరించాలని సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి మంజూరైన నిధుల వివరాలను సైతం వెల్లడించాలని అన్నారు. చండూరు మీటింగ్ ఒక టైమ్ పాస్ మీటింగ్. బహిరంగ సభ వేదికపై కేసీఆర్ ఏడ్చి ప్రజల్లో సింపథీని పొందే ప్రయత్నం చేస్తాడని సంజయ్ అన్నారు. కేసీఆర్ నటించేవాడు కాదు జీవించేవాడు.. నేడు జరిగే బహిరంగ సభే సీఎం కేసీఆర్ రాజకీయ జీవితానికి సమాధి కాబోతుంది అంటూ సంజయ్ వ్యాఖ్యానించారు.

CM KCR Chandur Public Meeting: నేడు చండూరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ.. సీఎం ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి..

సీబీఐ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. తప్పు చేయకుంటే ఎందుకంత భయం, తప్పు చేయకుంటే విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారు? అని సంజయ్ ప్రశ్నించారు. సీబీఐ విషయంలో ఆగస్టు 30న జీవో 51 ఇచ్చారని చెబుతున్నారని, బీజేపీ పిటీషన్ వేసేంత వరకూ జీవో అంశం బయటికి రాలేదన్నారు. లిక్కర్ కేసు రాగానే జీవో 51 ఇచ్చారంటూ బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ కు ఏ సంస్థపైనా నమ్మకం లేదు. ఇకనైనా కేసీఆర్ తప్పుడు ఆరోపణలు మానుకోవాలి అని సంజయ్ అన్నారు.