Telangana: కరీంనగర్-హసన్‭పర్తి రైల్వే లైన్‭కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యుల్‭లోని ఐటం నెంబర్-11 ప్రకారం తెలంగాణ అభివృద్ధి చేయాలని బండి సంజయ్ గుర్తు చేశారు. దాదాపు 62 కి.మీల మేరకు పనులు సాగే కరీంనగర్-హసన్‭పర్తి రైల్వే లైన్‭ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని బండి సంజయ్ తెలిపారు.

Telangana: కరీంనగర్-హసన్‭పర్తి రైల్వే లైన్‭కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

Karimnagar railway station

Telangana: ఉత్తర తెలంగాణ వాసులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దశాబ్దాలకు పైగా పెండింగులో ఉన్న కరీంనగర్-హసన్‭పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. నూతనంగా నిర్మించనున్న ఈ రైల్వే లైన్‭ నిర్మాణానికి సంబంధించి యుద్ద ప్రాతిపదికన రీ సర్వే చేసి నివేదిక సమర్పించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సర్వే నివేదిక వచ్చిన అనంతరమే నిధులు కేటాయింపుతో పాటు రైల్వే లైన్‭ నిర్మాణ పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

TSRTC: ప్రయాణికుల పట్ల సత్‭ప్రవర్తనపై కండక్టర్లకు కీలక సూచన చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈరోజు న్యూఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వీని వైష్ణవ్‭ను కలిసి కరీంనగర్-హసన్‭పర్తి రైల్వే లైన్‭ నిర్మాణానికి సంబంధించి వినతి పత్రం అందజేశారు. ఇక దీనితో పాటు మరో శుభవార్త కేంద్రం చెప్పింది. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లిలో రైలు ఆగేలా చర్యలు తీసుకోవాలని, ఆ ప్రాంతంలో స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై కూడా కేంద్రం సముఖత వ్యక్తం చేసింది. ఇక కరీంనగర్-హసన్‭పర్తి రైల్వే లైన్‭ విషయానికొస్తే.. 2013లో ఈ రైల్వే లైన్‭ నిర్మాణానికి సంబంధించి సర్వే చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నిర్ధిష్ట సమయంలోగా సరైన నిర్ణయం తీసుకోని కారణంగా రైల్వే లైన్ అంశంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయిందని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Revanth Reddy : రూ.25కోట్ల లొల్లి.. దమ్ముంటే భాగ్యలక్ష్మి ఆలయానికి రా-ఈటలకు రేవంత్ రెడ్డి సవాల్