Mahabubabad : పాపం..చెంబులో తలదూర్చిన కోతి, నీళ్లు తాగడం లేదు..తినడం లేదు

ఆ వానరం నీళ్లు తాగలేదు...ఆహారం తీసుకోవడం లేదు. మూడు రోజుల నుంచీ ఇదే పరిస్థితి. చెట్లు, చేమలపై స్వేచ్ఛగా విహరించే వానరం నీళ్లెందుకు తాగలేకపోతోంది..? ఏ ఆహారమూ ఎందుకు తీసుకోలేకపోతోంది..? ఎక్కడా నీళ్లు దొరకడం లేదా...? ఆహారం లభించడం లేదా...? లేకపోతే..ఎవరన్నా ఆ వానరాన్ని బంధించి ఇబ్బందులు పెడుతున్నారా...నీళ్లు, ఆహారం ఇవ్వకుండా బాధపెడుతున్నారా...? అనుకుంటున్నారా ? అదేమీ కాదు.

Mahabubabad : పాపం..చెంబులో తలదూర్చిన కోతి, నీళ్లు తాగడం లేదు..తినడం లేదు

Child Monkey

Child Monkey Head Stuck : ఆ వానరం నీళ్లు తాగలేదు…ఆహారం తీసుకోవడం లేదు. మూడు రోజుల నుంచీ ఇదే పరిస్థితి. చెట్లు, చేమలపై స్వేచ్ఛగా విహరించే వానరం నీళ్లెందుకు తాగలేకపోతోంది..? ఏ ఆహారమూ ఎందుకు తీసుకోలేకపోతోంది..? ఎక్కడా నీళ్లు దొరకడం లేదా…? ఆహారం లభించడం లేదా…? లేకపోతే..ఎవరన్నా ఆ వానరాన్ని బంధించి ఇబ్బందులు పెడుతున్నారా…నీళ్లు, ఆహారం ఇవ్వకుండా బాధపెడుతున్నారా…? అనుకుంటున్నారా ? అదేమీ కాదు.

ఊరంతా స్వేఛ్చగా తిరుగుతోంది. పైగా ఆ పిల్ల వానరం వెంట తల్లి కోతి కూడా ఉంది. అయినా సరే…ఆ చిన్న వానరం తిండి,నీళ్లు లేక నీరసించిపోతోంది. పోనీ స్థానిక ప్రజలు ఎవరన్నా పట్టుకుని చేరదీద్దామంటే…అందకుండా పారిపోతోంది. ఆ వానరానికి ఇన్ని కష్టాలు రావడానికి కారణం ఓ చెంబు. ఎక్కడ చేసిందో..ఎలా చేసిందో తెలియదు కానీ…పిల్ల కోతి చెంబులో తలదూర్చింది. ఇంకేముంది…ఆ తల చెంబులో ఇరుక్కుపోయింది. తల బయటకు రాకపోవడంతో పిల్ల వానరం పడరాని పాట్లుపడుతోంది. మహబూబాబాద్‌లోని వెంకటేశ్వర బజార్‌లో ఇలా పిల్ల వానరం పడుతున్న కష్టాలు చూసి స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

చిన్న వానరం తల చెంబులోనుంచి తీసేందుకు తల్లి కోతితో పాటు, ఇతర కోతులూ ప్రయత్నించాయి. కానీ తీయలేకపోయాయి. దీంతో ఆ చెంబుతోనే తల్లి వానరం వెంట సంచరిస్తోంది పిల్ల కోతి. మూడు రోజులుగా తల చెంబులోనే ఇరుక్కుపోయి చిన్న వానరం ఏమీ తినలేక, తాగలేకపోవడంతో…బక్కచిక్కిపోతోంది. వానరం చేసిన పని చూసి అందరికీ జాలి కలుగుతోంది. చిన్న కోతిని చూసి ఆవేదన చెందిన గ్రామస్థులు చెంబు తీసేందుకు ప్రయత్నించినా…అవి చిక్కకుండా పారిపోతున్నాయి. అధికారులు….ఎలాగోలా ప్రయత్నించి..పిల్ల వానరాన్ని రక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Read More : Mumbai : తడిసి ముద్దయిన ముంబాయి, నీట మునిగిన రోడ్లు