CM KCR : ఎంతటి వారైనా వదలొద్దు, డ్రగ్స్‌పై కేసీఆర్ కీలక ఆదేశాలు

డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణ నుంచి పూర్తిగా తరిమేయాలి. డ్రగ్స్ వాడేది ఎవరైనా ఉపేక్షించేది లేదు. ఏ పార్టీకి చెందిన వారైనా వదిలేది లేదు.

CM KCR : ఎంతటి వారైనా వదలొద్దు, డ్రగ్స్‌పై కేసీఆర్ కీలక ఆదేశాలు

Cm Kcr

CM KCR : దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా సమూలంగా నిర్మూలించాలని సీఎం కేసీఆర్ అన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు పోలీస్ అధికారులు వినూత్నరీతిలో బాధ్యత కలిగిన మానవులుగా ఆలోచనలు చేయాలన్నారు. సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంపూర్ణ నిర్మూలనకు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు కేసీఆర్.

సామాజిక ఉద్యమంగా మలచిన నాడే డ్రగ్స్ కంట్రోల్ సాధ్యమవుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రగతి భవన్ లో డ్రగ్స్ నిర్మూలనపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైలెవెల్ మీటింగ్ జరిగింది. పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

Alien Planets: “5,000 గ్రహాల్లో ఏలియన్స్”?.. అమెరికా అంతరిక్ష పరిశోధకుల వింత వాదన

‘నార్కోటిక్ డ్రగ్స్ వాడకం అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న చెడ్డ వ్యసనం. సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిది. ప్రజలను డ్రగ్స్ కు వ్యతిరేకంగా చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలి’ అని కేసీఆర్ అన్నారు. 1000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి ని సీఎం కెసీఆర్ ఆదేశించారు.

నార్కోటిక్ డ్రగ్స్ ను నియంత్రించే విభాగం కూడా శక్తివంతంగా పని చేయాలన్నారు. అద్భుత పనితీరు కనబరిచే పోలీస్ అధికారులకు అవార్డులు, రివార్డులు, ఆక్సెలరేషన్ ప్రమోషన్స్ తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించాలన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని కేసీఆర్ చెప్పారు. ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన వారైనా వదలొద్దని చెప్పారు. నేరస్తులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను తిరస్కరించాలని పోలీసు అధికారులకు సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు.

Type-2 Diabetes: డిన్నర్ లేటవుతుందా.. షుగర్ పెరుగుతుందన్న మాటే..

”డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణ నుంచి పూర్తిగా తరిమేయాలి. సామాజిక బాధ్యతతోనే డ్రగ్స్ వాడకాన్ని నివారించవచ్చు. డ్రగ్స్ సమాజానికి పట్టిన చీడ. డ్రగ్స్ వాడేది ఎవరైనా ఉపేక్షించేది లేదు. ఏ పార్టీకి చెందిన వారైనా వదిలేది లేదు. నేరస్తులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫార్సులను తిరస్కరించాలి. వెయ్యి మంది అధికారులతో కౌంటర్ ఇంటెలిజన్స్ ఏర్పాటు చేస్తాం” అని కేసీఆర్ అన్నారు.