CM KCR Meeting : మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ.. ఉద్యోగాల భర్తీ-జాబ్ కేలండర్, ధాన్యం కొనుగోళ్లపై చర్చ

దీంతోపాటు ఉద్యోగాల జాబ్ కేలండర్ కు సంబంధించిన విషయంలో కూడా అధికారులకు స్పష్టత ఇచ్చారు.

CM KCR Meeting : మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ.. ఉద్యోగాల భర్తీ-జాబ్ కేలండర్, ధాన్యం కొనుగోళ్లపై చర్చ

Kcr

CM KCR meeting with ministers : ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రంలో మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. కేంద్రంపై పోరాటానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. అటు తెలంగాణలో ఉద్యోగాల భర్తీ, జాబ్‌ క్యాలెండర్ విడుదలపైనా మంత్రులతో కేసీఆర్ చర్చించారు. అభివృద్ధి అంశాలు, యాదాద్రి ఆలయ పున:ప్రారంభోత్సవం, తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో కేసీఆర్ చర్చించారు.

ఈ సమావేశంలో 9 మంది మంత్రులు పాల్గొన్నారు. హరీష్ రావుతోపాటు ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. వీరితో పాటు అధికారులు కూడా హాజరయ్యారు. మొదటగా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అంశంపై ప్రధానంగా చర్చించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్.. అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల ప్రకటన చేశారు. ఏ విధంగా ఉద్యోగాలను ప్రకటించాలి? ఏ ఏ డిపార్ట్ మెంట్లను మొదటగా ప్రకటించాలన్న విషయాలపై కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

TRSLP meeting : మార్చి21న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం..ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరుకావాలని ఆదేశాలు

దీంతోపాటు ఉద్యోగాల జాబ్ కేలండర్ కు సంబంధించిన విషయంలో కూడా అధికారులకు స్పష్టత ఇచ్చారు. అదేవిధంగా ఈఏడాది చవరిలోపు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయగల్గుతారు? ఏ ఏ ఉద్యోగాలను, ఎంతలోపు పూర్తి చేస్తారనే విషయాలను అధికారులను అడిగి కేసీఆర్ తెలుసుకున్నారు. ఆయా విభాగాల వారిగా జాబ్ కేలండర్ తయారు చేసి దానికనుగుణంగా నోటిఫికేషన్లు వచ్చే విధంగా చూడాలని మంత్రులు, అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

ఇక ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిని తప్పుబడుతూ మరోసారి ఢిల్లీ వేదికగా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు చేయాలని సీఎం నిర్ణయించారు. దీనికి సంబంధించి మంత్రులతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు. ఒకవైపు కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కేసీఆర్ తప్పుబట్టారు. రానున్న రోజుల్లో కేంద్రంపై ఎలా పోరాటం చేయాలన్నదానిపై ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Tirumala Car burnt : తిరుమలకు వెళ్తుండగా రెండో ఘాట్ రోడ్డులో కారు దగ్ధం

ఇందులో భాగంగానే ఈనెల 21న టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కానుంది. తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటలకు సమావేశం అవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీ నేతలందరూ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అదేరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ తోపాటు మరికొంత మంది మంత్రుల బృందం, ఇతర నేతలు కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు.