CM KCR : మరోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్.. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల భేటీకి హాజరు!

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. ఈ నెల 25న ఆయన హస్తినకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నెల 26న జరిగే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల భేటీకి ఆయన హాజరుకానున్నారు.

CM KCR : మరోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్.. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల భేటీకి హాజరు!

Cm Kcr (1)

CM KCR Delhi tour : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. ఈ నెల 25న ఆయన హస్తినకు వెళ్లే అవకాశం ఉంది. 26న కేంద్రం హోమంత్రి నేతృత్వంలో జరిగే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల భేటీకి హాజరయ్యే ఛాన్స్ ఉంది. కేసీఆర్‌ మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ శంకుస్థాపనకు ఈ నెల ఒకటిన ఢిల్లీ వెళ్లిన కేసీఆర్… 9 రోజుల పాటు.. ఢిల్లీలోనే ఉన్నారు.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానుండటంతో మొదటి రోజు సెషన్‌కు హాజరై…సాయంత్రం ఢిల్లీ వెళ్తారు. కేసీఆర్‌ మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరుగనున్న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ శంకుస్థాపనకు ఈ నెల ఒకటిన ఢిల్లీ వెళ్లిన కేసీఆర్… 9 రోజుల పాటు.. ఢిల్లీలోనే ఉన్నారు.

CM KCR : లక్ష రూపాయల యంత్రం 20వేలకే.. ఆ వృత్తుల వారికి సీఎం కేసీఆర్ శుభవార్త

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం.. ఆ పనుల నిమిత్తం సెప్టెంబర్ 1న ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కేవలం 3 రోజుల పాటు బస చేయాలని భావించిన కేసీఆర్​.. పలు కార్యక్రమాల దృష్ట్యా వారం రోజులపాటు అక్కడే ఉన్నారు. 2న ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేసీఆర్​ శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ నెల 3న ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్​ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై విడివిడిగా పది లేఖలు అందజేశారు. యాదాద్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాల్సిందినగా మోడీని కేసీఆర్ ఆహ్వానించారు. ఆ తర్వాత కేంద్ర హోంమత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులతోనూ కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావల్సిన నిధులపై చర్చించారు.